Rama Rama Lyrics In Telugu – Sehari
ఓ రామ రామా
అమ్మాయో అమ్మాయో
అమ్మాయో ఎవరీ కుర్రాళ్ళు
అమ్మాయో జతగా ఉన్నారు
తమరి కోసం పనులన్నీ మానేసి
కనులు మూసి దూకేసారే రామ రామా
ఆ, రావయ్యా ఓ రామ… ఓ రామ రామ
బోలెడన్ని సెప్పాలోయ్… ఓ రామ రామ
సెప్పేవి కాదంట… ఓ రామ రామ
అయినా గాని సెప్పేస్తా… ఓ రామ రామ
ఎక్కాలు రావంటా… ఓ రామ రామ
లెక్కలే వేస్తుంటే… ఓ రామ రామ
దిక్కేది లేదంట… ఓ రామ రామ
దిక్కులే చూస్తుంటే… ఓ రామ రామ
స్కెచ్చాలు ఎయ్యాలంట… ఓ రామ రామ
హెచ్చులే పోతుందే… ఓ రామ రామ
ఎక్కెక్కి నవ్వేస్తా… ఓ రామ రామ
సక్కగా ముగ్గురూ సిక్కులే ఇప్పుతుంటే
దిస్ ఈజ్ నాట్ ఏ జోక్
ఓఓ, ఇరువురి కథ… ఇరుకుల బొంత
సవతుల వలె… సాగెను సంత
పురుషుల గతి… కుడితిల పడ్డ
ఎలుకై పోయిందా..?
తెలవని పని సులువనుకున్న
కెలికే సరికే సిలువయ్యానా
తెలివిగ తెగ మోస్తూ ఉన్న సాన హైరానా
గండు చీమలల్లె పంచదార చుట్టూ
చేరుకున్నారంట చూసేటట్టు
నిలకడ ఎరగని మరకత గాళ్ళు
ఓరయ్యో గడుసోల్లే
ఆ ఆ, ఇన్నావుగా రామ… ఓ రామ రామ
బోలెడన్ని సెప్పేసా… ఓ రామ రామ
సెప్పేసినా కూడా… ఓ రామ రామ
ఇంకోసారి సెప్పేస్తా… ఓ రామ రామ
ఎక్కాలు రావంట… ఓ రామ రామ
లెక్కలే జేసిండ్రే… ఓ రామ రామ
దిక్కేది లేదంట… ఓ రామ రామ
చుక్కలెన్నో జూసిండ్రే… ఓ రామ రామ