Menu Close

Rama Chakkani Seethaki Song Lyrics In Telugu

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

నీల గగన ఘనవిచలన
ధరణిజ శ్రీ రమణ… ఆ ఆఆ
మధుర వదన నళిన నయన
మనవి వినరా రామా

రామ చక్కని సీతకి… అరచేత గోరింట
ఇంత చక్కని చుక్కకీ… ఇంకెవరో మొగుడంట
రామ చక్కని సీతకీ

ఉడత వీపున వేలు విడిచిన
పుడమి అల్లుడు రాముడే
ఎడమ చేతను శివుని విల్లును
ఎత్తిన ఆ రాముడే
ఎత్తగలడా సీత జడనూ
తాళి కట్టే వేళలో
రామ చక్కని సీతకీ

ఎర్రజాబిలి చేయిగిల్లి… రాముడేడని అడుగుతుంటే
చూడలేదని పెదవి చెప్పే… చెప్పలేమని కనులు చెప్పే
నల్లపూసైనాడు దేవుడు… నల్లనీ రఘురాముడూ
రామ చక్కని సీతకీ

చుక్కనడిగా దిక్కునడిగా… చెమ్మగిల్లిన చూపునడిగా
నీరు పొంగిన కనులలోన… నీటి తెరలే అడ్డునిలిచే
చూసుకోమని మనసు తెలిపే… మనసు మాటలు కాదుగా

రామ చక్కని సీతకి… అరచేత గోరింట
ఇంత చక్కని చుక్కకీ… ఇంక ఎవరో మొగుడంట
రామ చక్కని సీతకీ
ఇందువదన కుందరదన మందగమన భామా
ఇందువలనా ఇందువదనా…
ఇంత మదనా..? ప్రేమా..?

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading