ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
RGV Telugu Quotes, Ram Gopal Varma Telugu Quotes
మెడకాయ మీద తలకాయ లేనివారే జాతకాలు నమ్ముతారు.
పిల్లలకి చాల తెలివి ఉంటుంది కానీ రాను రాను పెద్దైయే సరికి పేరెంట్స్, మతం, టీచర్స్, ముగ్గురు కలిసి వాణ్ణి తెలివి తక్కువ దద్దమ్మని చేస్తారు. నేనెందుకు తెలివిగా ఉన్నానంటే నేనెప్పుడూ ఎవ్వరి మాట వినలేదు కాబట్టి.
ఒక రాజకీయం, ఒక మతం, ఒక కులం, ఒక ప్రాంతం, ఒక అభిమానం నిన్ను ఎరగా వాడుతుంటే, నిన్ను…నేను ఏవిధంగా వాడిన తప్పులేదు.
హార్డ్ వర్క్ మాత్రమే సక్సెస్ ఇచ్చేట్టు అయితే ఈ పాటికి చాలామంది కూలీలు అంబానీలు అయ్యేవాళ్ళు.
భారతీయులు భారత్ దేశాన్ని ప్రేమిస్తారు. భారతీయుల్ని ప్రేమించరు.
కోళ్లు, చేపలు చచ్చాక దెయ్యాలు కావు. ఒకవేళ అయ్యుంటే ప్రపంచంలో ఉన్న అన్ని రెస్టారెంట్లు, వంటగదులు భూత పిశాచాలకు నిలయంగా ఉండేది.
నీ జీవితంలో నువ్వు నాకు ఎన్నటికీ శత్రువు కాలేవు. ఎందుకంటే, ఇది నాకు నేను రాసుకున్న కథ. ఇది నా కథ. నాకు జీవితంపైన పరిపూర్ణమైన అవగాహన ఉన్న కథ. నాపై పగ, ద్వేషం, ఈర్ష లాంటివి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్లే, నీ సమయం వృధా.
అభద్రతా భావం, విపరీతమైన ఆత్మనూన్యతా ఉన్నవాళ్ళే ఎక్కువగా స్నేహితులని కోరుకుంటారు…..నాకు స్నేహితులు లేరు.
ఇక్కడ నాకోసం నేను మాత్రమే బ్రతుకుతున్న ఎవరికీ నా జీవితాన్ని అంకితం ఇవ్వడం లేదు.
అవకాశం మీ తలుపు ఎప్పుడూ తడుతుందా అని వేచిచుసేకన్నా తలుపు తెరిచి ఉంచడం మంచిది.
నేను దేవుడు, కులం, మతంలాంటి వాటిని నమ్మను, నా భావాలు, నా ఆలోచనలే నా దేవుళ్ళు, నా మతాలు.
నాకు భయంలేదు ఎందుకంటే మనిషికి తనది ఏదైనా పోతున్నపుడే భయపడుతాడు అది ప్రాణం, డబ్బు ఏదైనా కావొచ్చు కానీ నేను వీటిల్లో దేనికి విలువ ఇవ్వను.
మొదట నిన్ను నువ్వు ప్రేమించుకో ఆ తరువాత పక్కవాళ్ళ గురించి ఆలోచించు…జీవితాన్ని ప్రేమించే ఏ మనిషి కూడా ఆత్మహత్య చేసుకోడు.
నేనెప్పుడూ ఫ్లాపులు తీయలేదు…అసలు సినిమా అనేది ఎలా తీయకూడదో అన్న విషయం తెలుసుకునే క్రమంలో కూడా చాలాసార్లు సక్సెస్ అయ్యాను.
ఎప్పుడు రాజకీయ నాయకుల్ని విమర్శించే సాధారణ పౌరుడు, రాజకీయ నాయకుడు కాగలిగితే రాజకీయ నాయకులకంటే ఎక్కువగా దోచుకుంటాడు.