Rakesh Jhunjhunwala Investment Strategies in Telugu, Investment Tips in Telugu, Investment Calls in Telugu, Investment Lessons in Telugu, Investment Hacks in Telugu.
ప్రముఖ షేర్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఆకస్మిక మరణంపై ట్రేడ్ మార్కెట్ పండితులు, దేశ వ్యాపార వేత్తలు దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. రాకేష్ ఝున్‌ఝున్‌వాలా దశాబ్దాల పాటు షేర్ మార్కెట్ లో గొప్ప ఇన్వెస్టర్ గా నిలబడ్డారు.
షేర్ మార్కెట్ గురుంచి కనీస అవగాహన వున్నవారికి రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఈ పేరు బాగా పరిచయం. ఈయన ఫండమెంటల్ ఎనలిస్ట్, ఒక కంపనీ పని తీరును బాగా అర్దం చేసుకుని అలాంటి కంపనీలలోనే ఇన్వెస్ట్ చేసేవారు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ గా చాలా ఖ్యాతి సంపాదించారు.
రాజస్తానీ మార్వాడీల కుటుంబానికి చెందిన రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా.. ముంబైలో పుట్టి పెరిగారు. ఆయన తండ్రి ముంబైలో ఆదాయపు పన్ను శాఖ కమిషనర్‌గా పనిచేసేవారు. స్టాక్‌మార్కెట్లలో తండ్రి ఇన్వెస్ట్ చేస్తుండటం, వాటి గురించి స్నేహితులతో చర్చిస్తుండటం వంటి వాతావరణంలో పెరగడంతో తనకు చిన్నతనం నుంచే పెట్టుబడులపై ఆసక్తి ఏర్పడినట్లు రాకేశ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
వార్తల్లో ఉన్న తీరును బట్టి కంపెనీలు పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయని తండ్రి వివరించడంతో 15 ఏళ్ల ప్రాయం నుంచే మార్కెట్ వార్తల్ని, షేర్లను పరిశీలించడం ప్రారంభించారు. డిగ్రీ తర్వాత స్టాక్ మార్కెట్ల వైపు వెళ్తానంటూ తండ్రికి చెప్పారు. కానీ సీఏ చేసి ఆర్థికంగా కాస్త నిలదొక్కుకున్న తర్వాతే ఆ విషయాన్ని ఆలోచించాలని తండ్రి సూచించారు. ఆయన మాట ప్రకారమే సీఏ చదివిన తర్వాత మార్కెట్లోకి అడుగుపెట్టారు.
రాకేష్ ఝున్‌ఝున్‌వాలా షేర్ మార్కెట్ ని కొన్ని దశాబ్దాల పాటు అర్దం చేసుకుని చెప్పిన కొన్ని ఆణిముత్యాలాంటి మాటలు. ఇవి షేర్ మార్కెట్ మీద ఆసక్తి వున్న వారికి కచ్చితంగా ఉపయోగపడతాయి.
► మహిళలు, మార్కెట్లు, మరణం, వాతావరణం గురించి ఎవరూ అంచనా వేయలేరు.
► కెరటాలకు ఎదురెళ్లండి. అంతా అమ్మేస్తున్నప్పుడు కొనండి, అంతా కొంటున్నప్పుడు అమ్మేయండి.
► నష్టాలకు సిద్ధపడి ఉండండి. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టరు జీవితంలో నష్టాలు కూడా భాగమే.
► అసమంజసమైన వేల్యుయేషన్లలో ఇన్వెస్ట్ చేయొద్దు. ప్రస్తుతం వెలుగులో ఉన్న కంపెనీల వెంట పరుగులు తీయొద్దు.
► మార్కెట్‌ను గౌరవించండి. ఎంత ఒడ్డాలి. నష్టపోతే ఎప్పుడు తప్పుకోవాలి గుర్తెరగాలి. బాధ్యతగా ఉండాలి.
► తొందరపాటు నిర్ణయాలు ఎల్లప్పుడూ నష్టాలే తెచ్చిపెడతాయి. తగినంత సమయం తీసుకుని, అధ్యయనం చేశాకే ఏ షేరులో ఇన్వెస్ట్ చేయాలి.
► ఎల్లప్పుడూ స్టాక్ మార్కెట్లే కరెక్ట్. అదను కోసం ఎదురుచూస్తూ కూర్చోవద్దు.
► భావోద్వేగాలతో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే, కచ్చితంగా నష్టాలే మిగులుతాయి.
► నష్టాలను భరించే సత్తా లేకపోతే స్టాక్ మార్కెట్లో లాభాలు పొందలేరు.
► సమర్ధమైన, పోటీతత్వం ఉన్న మేనేజ్‌మెంట్ గల కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేయాలి.
► మంచి ట్రేడరు, ఇన్వెస్టరుగా ఉండదల్చుకుంటే.. రెంటినీ వేర్వేరుగానే ఉంచాలి.
► ట్రేడింగ్ చేయాలంటే మనిషి తన అహాన్ని తగ్గించుకోగలగాలి. అలాంటి సామర్థ్యాలు చాలా కొద్దిమందికే ఉంటాయి. కాబట్టే 10 లక్షల మందిలో 9.99 లక్షల మంది నష్టపోతుంటారు. అందుకే ట్రేడింగ్ చేయొద్దన్నది నా వ్యక్తిగత సలహా.
► ఆర్థికవేత్తల మాటలను పట్టించుకుని ఉంటే నేను ఇంత సంపద ఆర్జించి ఉండేవాణ్ని కాను.
► మార్కెట్ అసంబద్ధమైనదని, మీకు అన్నీ తెలుసు అని మీరు అనుకుంటే తప్పుల నుంచి ఎన్నటికీ నేర్చుకోలేరు.
Rakesh Jhunjhunwala Investment Strategies in Telugu, Investment Tips, Investment Hacks.
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.