ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Rajasekhara Aagalenu Ra Lyrics In Telugu – Mugguru Monagallu
రాజశేఖరా ఆగలేనురా… రాజశేఖరా ఆగలేనురా
పైటలో స్వరాలనే… మీటి చూడరా
ఓ సఖీ చెలీ… తేనె జాబిలీ
తీరని సుఖాలలో… తీపి ఆకలీ
రాజశేఖరా ఆగలేనురా… ఓ సఖీ చెలీ
చాటుగా తెర చాటుగా… కసి కాటులో పెదవే
ఘాటుగా అలవాటుగా… ఒడి పాఠమే చదివే
చిరు చిత్రాలతో… నడుమే అడిగే వగలే
మధు పత్రాలతో… నలుగే పెడితే సెగలే
శృంగార గంగ… పొంగేటి వేళ
రుచులే మరిగే మత్తులో…
రాజశేఖరా ఆగలేనురా…
పైటలో స్వరాలనే… మీటి చూడరా
ఓ సఖీ చెలీ…
హా..! తేనె జాబిలీ…
కొంటెగా తొలి రాతిరి… చలి మంటలే పుడితే
జంటలో కసి చాకిరి… గిలి గంటలే కొడితే
గురి చూసెయ్యవా… సొగసే బిగిసె సుడిలో
తెర తీసెయ్యవా… ఎదలే కరిగే బడిలో
నా లేత ఒళ్ళు… నీ చూపు ముళ్ళు
తగిలే రగిలే రేయిలో…
రాజశేఖరా ఆగలేనురా…
పైటలో స్వరాలనే… మీటి చూడరా
ఓ సఖీ చెలీ… తేనె జాబిలీ
తీరని సుఖాలలో… తీపి ఆకలీ