Menu Close

Raamaayanamu Lyrics in Telugu – Sri Rama Rajyam

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Raamaayanamu Lyrics in Telugu – Sri Rama Rajyam

రామాయణము శ్రీ రామాయణము

రామాయణము శ్రీ రామాయణము
అడుగడుగున త్యాగము అణువణువున ధర్మమూ
అడుగడుగున త్యాగము అణువణువున ధర్మమూ
అనురాగము అనుబంధము అనుపమానము
అనురాగము అనుబంధము అనుపమానము
సహన శీల ధీర వీర వరగభీరము
సహన శీల ధీర వీర వరగభీరము
రామాయణము శ్రీ రామాయణము
రామాయణము శ్రీ రామాయణము

శ్రీ రామ పట్టాభిషేకం
శ్రీ రామ పట్టాభిషేకం
దశరధుడు చేసే ఆదేశం
శ్రీ రామ పట్టాభిషేకం
దశరధుడు చేసే ఆదేశం
ఉప్పొంగి పోయే ఆ దేశం ఉప్పొంగి పోయే ఆ దేశం
కలవరం తెచ్చింది కైక కిచ్చిన వరం
కానలకు పంపమని లేక ఏ కనికరం పదునాలుగేళ్ళు శ్రీ రాముని
వనవాసమును చేయమన్నది వనవాసమును చేయమన్నది

చెదరని దరహాసం కదిలేను వనవాసం
చెదరని దరహాసం కదిలేను వనవాసం
వదిలి రాణివాసం వచ్చే మగణి కోసం
తండ్రి మాటకోసం కొడుకు తండ్రి కోసం
తండ్రి మాటకోసం కొడుకు తండ్రి కోసం
భార్య మగని కోసం లక్ష్మన్న అన్న కోసం
జనమంతా ఆక్రోశం జనమంతా ఆక్రోశం జనమంతా ఆక్రోశం

ఏమయ్యా రామయ్యా ఏమైపోవాలయ్యా మేమేమైపోవాలయ్యా
ఏమయ్యా రామయ్యా ఏమైపోవాలయ్యా మేమేమైపోవాలయ్యా
అటు పుర జనులు ఇటు దశరధుడు వెక్కి యేడ్చినారు మొక్కి ఆపినారు
సత్య వచనమై సాగెను రఘుపతి ధర్మ కవచమై అనుసరించేను సతి
లక్ష్మణుడేగెను వినయశీలుడై
అయోధ్య మిగిలెను అమావాస్యాయై అయోధ్య మిగిలెను అమావాస్యాయై

రామాయణము శ్రీ రామాయణము
రామాయణము శ్రీ రామాయణము
అడుగడుగునా త్యాగము అణువణువునా ధర్మమూ
అడుగడుగునా త్యాగము అణువణువునా ధర్మమూ
అనురాగము అనుబంధము అనుపమానము
అనురాగము అనుబంధము అనుపమానము
సహన శీల ధీర వీర వరగభీరము
సహన శీల ధీర వీర వరగభీరము
రామాయణము శ్రీ రామాయణము
రామాయణము శ్రీ రామాయణము

Raamaayanamu Lyrics in Telugu – Sri Rama Rajyam

Like and Share
+1
0
+1
1
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading