Raama Silaka Folk Lyrics In Telugu – Mamidi Mounika
సిలకో ఓ సిట్టి సిలకో
సిలకో నా సిట్టి సిలకా
నీ సిలక మొఖం మీద
సిన్న దాని మనసు
సిలకో నా సిట్టి సిలకా
సిలకో ఓ సిన్ని సిలకో
సిలకో నా సిన్ని సిలకా
నీ ఎన్కబడి నిన్నే
ఏరుకుంది వయసు
సిలకో ఓ సిన్ని సిలక
సిన సిన్న మాటల్కి
సిల్క మొఖం గట్ల
సిన్నబుచ్చుకొని
అలిగిపోకే నా సిలకో నా సిలకా
సిలకో ఓ సిట్టి సిలకో
సిలకో నా సిట్టి సిలకా
నీ సిలక మొఖం మీద
సిన్న దాని మనసు
సిలకో నా సిట్టి సిలకా
ఓయ్, సిలకో నా వన్నె సిలకో
సిలకో నా వన్నె సిలక
నేను పంచె పాలవట్టి
పంచె ముగ్గులేత్తే
సిలకో నా వన్నె సిలక
సిలకో నా సిన్న సిలకో
సిలకో నా సిన్న సిలక
నీ పంచె పాణాలెల్లి
పోతున్నాయంటివే
సిలకో నా సిన్న సిలక
నీకోసమే నేను నాకోసమే నువ్వు
నీ బలుపు లేకుంటే నేనెక్కడా బోను
సిలకో నా సిలక
అర్రే, సిలకో ఓ సిట్టి సిలకో
సిలకో నా సిట్టి సిలకా
నీ సిలక మొఖం మీద
సిన్న దాని మనసు
సిలకో నా సిట్టి సిలకా
నా సిలకో సిన్నారి సిలకో
సిలకో సిన్నారి సిలక
నా బంతిపూవు తొట్లల్లా
బాలుడు మల్లయ్య
సిలకో సిన్నారి సిలకా
సిలకో బంగారి సిలకో
సిలకో బంగారి సిలక
మా ఇంట్ల బాల మల్లయ్యకు
బండారి పట్నాలు ఇయ్యంగ
బంగారి సిలకా