Menu Close

Raa Narakara Song Lyrics In Telugu – Narappa

అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి

రా నరకరా నరకరా… ఎదురుతిరిగి కసిగ రా
నరకరా నరకరా… తలలు ఎగిరి పడగ రా
చెర చెరా చెరకరా… మెడని మెడని విడిగ రా
తరమరా తురమరా… నరము నరము విడగ

కత్తి గొంతులో నెత్తురెయ్యరా
మట్టి నోటిలో దండ ముద్ద కలిపివెయ్యరా
నీలి నింగిని గాలి రంగుని ఎర్రఎర్రగా మార్చి వెయ్యరా
ఆయుధానికే ఆయుధానివై ఆయువుల్ని తీసి చేసుకోర చావు జాతరా

రా నరకరా నరకరా… ఎదురుతిరిగి కసిగ రా
నరకరా నరకరా… తలలు ఎగిరి పడగ రా
చెర చెరా చెరకరా… మెడని మెడని విడిగ రా
తరమరా తురమరా… నరము నరము విడగ

గుండెలోకి గునపమై… కడుపులోకి కొడవలై
దూసుకెళ్లి కోసుకెళ్లి పేగులన్ని తొలచివెయ్
గాయపడ్డ మనసువై… మోసపడ్డ మనిషివై
లోపలున్న రాక్షసున్ని దాచకింక పైకి తియ్

కౄర మృగమువై… కౄర కౄర మృగమువై
గోళ్ళ కొనలతో వాళ్ళ రొమ్ములన్ని వలిచివెయ్
కాల యముడివై… పూనకాల యముడివై
పాశమిసిరివెయ్… వెన్నుపూసలన్ని విరిచివెయ్

రా నరకరా నరకరా… ఎదురుతిరిగి కసిగ రా
నరకరా నరకరా… తలలు ఎగిరి పడగ రా
చెర చెరా చెరకరా… మెడని మెడని విడిగ రా
తరమరా తురమరా… నరము నరము విడగ

వేటు వేస్తె నలుగురు… పోటు వేస్తె పదుగురు
వేట నీకు కొత్త కాదు… వీళ్ళు ఎవరు మిగలరు
రగులుతున్న క్షణములో… సెగల కళ్ళ వెలుతురు
తగలబెడుతు ఉంటె వాళ్ళు వెనక ముందు మిగలరు

కోరి సమరమో కోరకుండ సమరమో
ఎంత సమరమో ముగియడానికెంత సమయమో
కోరి మరణమో కోరకుండ మరణమో
ఏది మరణమో తేల్చడానికేది తరుణమో

రా నరకరా నరకరా… ఎదురుతిరిగి కసిగ రా
నరకరా నరకరా… తలలు ఎగిరి పడగ రా
చెర చెరా చెరకరా… మెడని మెడని విడిగ రా
తరమరా తురమరా… నరము నరము విడగ

Like and Share
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading