ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
రా రా కుమారా రాజసాన ఏలగా
ఎదపై చేరనీరా పూలమాలె నేనుగా
నీవు తీసె శ్వాసలో… ఊయలూగే ఆశతో
పంపుతున్నా నా ప్రాణాన్ని నీ వైపుగా
రా రా కుమారా రాజసాన ఏలగా
ఎదపై చేరనీరా పూలమాలె నేనుగా
నీ తలపులతో మరిగిపోయె… ఒంటరి తనమూ ఇష్టమే
నీ కబురులతో కరిగిపోయె… ప్రతి ఒక క్షణమూ ఇష్టమే
కలలే నిజమయేలా… కళ్లు తెరిచిన కోరిక ఇష్టం
నిజమే కల అయేలా ఒళ్లు మరచిన… అయోమయం మరింత ఇష్టం
రా రా కుమారా రాజసాన ఏలగా
ఎదపై చేరనీరా పూలమాలె నేనుగా
బరువనిపించే బిడియమంతా… నీ చేతులలో వాలనీ
బతకడమంటే ఎంత మధురం… నీ చేతలలో తెలియనీ
నేనేం చేసుకోను నీకు పంచని… ఈ హృదయాన్ని
ఇంకేం కోరుకోను నిన్ను మించిన… మరో వరం ఏదైనాగానీ
Like and Share
+1
21
+1
27
+1