Puttina Roju Jejelu Chitti Papayi Lyrics In Telugu – Bangaru Kalalu
పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి
పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి
నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి
పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి
కళకళలాడే నీ కళ్ళు… దేవుడి ఇళ్ళమ్మా
కిలకిల నవ్వే నీ మోము… ముద్దుల మూటమ్మా
కళకళలాడే నీ కళ్ళు… దేవుడి ఇళ్ళమ్మా
కిలకిల నవ్వే నీ మోము… ముద్దుల మూటమ్మా
నీకోసమే నే జీవించాలి… నీవే పెరిగి నా ఆశలు తీర్చాలి
పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి
నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి
పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి
ఆటలలో చదువులలో… మేటిగ రావాలి
మంచితనానికి మారుపేరుగా… మన్నన పొందాలి
ఆటలలో చదువులలో… మేటిగ రావాలి
మంచితనానికి మారుపేరుగా… మన్నన పొందాలి
చీకటి హృదయంలో… వెన్నెల కాయాలి
నా బంగారు కలలే… నిజమై నిలవాలి
పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి
నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి
పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి
నచ్చినవాడు మెచ్చిన ప్రియుడు… నాధుడు కావాలి
నచ్చినవాడు మెచ్చిన ప్రియుడు… నాధుడు కావాలి
నీ సంసారం పూల నావలా సాగిపోవాలి
నీ తల్లి కన్నీరు పన్నీరు కావాలి
నిన్నే తలచి నే పొంగిపోవాలి
పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి
నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి
పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి