Menu Close

పుష్ప 2 హిట్ లేక ఫట్టా? – Pushpa 2 Review in Telugu

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

పుష్ప 2 హిట్ లేక ఫట్టా? – Pushpa 2 Review in Telugu

నటీనటులు:
అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, జగదీష్ భండారీ తదితరులు
కథ, కథనం, దర్శకత్వం: సుకుమార్
నిర్మాత: నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్
సినిమాటోగ్రఫి: మిరోస్లోవ్ క్యుబా బ్రోజెక్
మ్యూజిక్: దేవీ శ్రీ ప్రసాద్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్
రిలీజ్ డేట్: 2024-12-05

telugu quotes, telugu poetry, telugu stories, telugu jokes

ఎర్రచందనం అక్రమ దందాలో బ్రోకర్స్‌ను తప్పించి నేరుగా అంతర్జాతీయ మార్కెట్‌లోకి ప్రవేశించాలనే టార్గెట్‌తో పుష్పరాజ్ (అల్లు అర్జున్) ప్లాన్ వేస్తాడు. పుష్ప రాజ్‌కు ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ (ఫాహద్ ఫాజిల్) అడ్డు తగులుతాడు. అయితే ఏపీ రాజకీయాలను ప్రభావితం చేస్తూ చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం అక్రమ వ్యాపార సామ్రాజ్యాన్ని అనూహ్యంగా విస్తరిస్తాడు.

అయితే ఎస్పీ షెకావత్‌ను ఎలా ఎదురించాడు?
పుష్పరాజ్‌‌కు ఎదురైన సవాళ్లు ఏమిటి?
పుష్ప రాజ్‌ను తన కుటుంబం ఆదరించిందా?
ఏపీ రాజకీయాలను పుష్ప రాజ్ ఎలా ప్రభావితం చేశాడు?
చిత్తూరు జిల్లాలో పుష్పరాజ్ హవా ఎలా కొనసాగింది?
జపాన్‌లో పుష్పరాజ్‌కు ఎదురైన సమస్య ఏమిటి?
అనే ప్రశ్నలకు సమాధానమే పుష్ప ది రూల్ సినిమా కథ.

పుష్ప 2 సినిమా కథ గురించి ఆలోచించించకుండా పక్కన పెడితే.. సుకుమార్ రాసుకొన్న నాలుగైదు ఎపిసోడ్స్‌ బాగా వర్కవుట్ అయ్యాయి. అయితే ఫస్టాఫ్‌లో ఇంటర్వెల్ వరకు సాగదీసి సుకుమార్ టైంపాస్ చేశాడనే చెప్పాలి. అయితే ఇంటర్వెల్ ఎపిసోడ్‌తో చెలరేగిపోయిన దర్శకుడు..

సెకండాఫ్‌లో జాతర ఎపిసోడ్‌తో ఎవరూ ఊహించని రేంజ్‌‌కు సినిమాను తీసుకెళ్లాడనే ఫీలింగ్ కల్పించాడు. సుదీర్ఘమైన జాతర ఎపిసోడ్‌తో ఊపిరి ఆడనివ్వకుండా చేసిన సుకుమార్‌కు ఆ తర్వాత ఏం చేయాలనే ప్రశ్నగానే మారిందనిపిస్తుంది.

అయితే సిస్టర్ సెంటిమెంట్‌తో మూవీని క్లైమాక్స్ వరకు మరోమారు లాగించాడనిపిస్తుంది. ఓవరాల్‌ ప్యాకేజ్‌గా ప్రేక్షకుడికి గొప్ప అనుభూతిని కలిగించే విధంగా సుకుమార్ సక్సెస్ అయ్యాడు. జపాన్‌లో మొదలుపెట్టిన విషయాన్ని సుకుమార్ మరిచిపోయాడా? దానికి ముగింపు లేకుండానే సినిమాను హడావిడిగా ముగించాడనిపిస్తుంది.

నటీనటుల ఫెర్ఫార్మెన్స్:

అల్లు అర్జున్ అద్బుతంగా ప్రతీ ఎపిసోడ్‌లోను ఇరుగదీశాడు. ముఖ్యంగా జాతర ఎపిసోడ్‌లో చేసిన డ్యాన్స్, ఫైట్స్ అదరహో అనిపించేలా ఉన్నాయి. అలాగే సిస్టర్ సెంటిమెంట్ ఎపిసోడ్, ఫ్యామిలీ ఎమోషన్స్ సన్నివేశాల్లో ఉద్వేగానికి గురిచేస్తాడు. అలాగే శ్రీవల్లి పెగ్రెన్సీ సీన్స్‌లో ఎమోషనల్‌గా నిజంగానే ఐకాన్ స్టార్ అనిపించుకొన్నాడు.

అదిరిపోయిన పుష్ప 2 టీజర్ - Pushpa 2 Teaser - Allu Arjun in Saree Telugu Bucket

రష్మిక మందన్న కొన్ని సీన్లలో మెప్పించింది. శ్రీలీల స్సెషల్ సాంగ్‌లో మెరుపుతీగల మెరిసింది. షెకావత్‌గా ఫాహద్ ఫాజిల్ ఎప్పటిలానే తన మార్క్ చూపించారు. అనసూయ, సునీల్, జగపతి బాబు అంతగా ఆకట్టుకోలేకపోయారు. ఉన్నంతలో రావు రమేష్, బ్రహ్మాజీ ఫర్వాలేదనిపిస్తారు. మొత్తంగా అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో ముందు అందరూ తేలిపోయారు.

సాంకేతిక అంశాలు:

ఈ సినిమాకు నూటికి నూరు శాతం న్యాయం చేసిన వారెవరైనా ఉంటే అది దేవీ శ్రీ ప్రసాద్ మాత్రమే. కొన్ని ఎపిసోడ్స్‌లో రీరికార్డింగ్‌తో దుమ్మురేపాడు. సీన్లలోని కంటెంట్ మాత్రమే కాకుండా యాక్టర్ల ఫెర్ఫార్మెన్స్‌ను ఎలివేట్ చేసే విధంగా మ్యూజిక్ వర్కవుట్ అయింది. సినిమాకు లెంగ్త్ సహనానికి పరీక్షలా ఉంటుంది. ఓ 20 నిమిషాలు ఎడిట్ చేయడానికి స్కోప్ ఉంది.

సినిమాటోగ్రఫి, ఆర్ట్ వర్క్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. నిర్మాణ విలువలు హై స్టాండర్డ్‌లో ఉన్నాయి. అల్లు అర్జున్‌ నటనా విశ్వరూపానికి మచ్చు తునకలా నిలిచిపోయే సినిమా పుష్ప 2. ఈ సినిమా తర్వాత స్టైలిష్ స్టార్ క్రేజ్ ఎన్నో రెట్లు పెరిగిపోవడం ఖాయం.

మాస్ ఎలిమింట్స్, గ్లామర్, యాక్షన్, ఎమోషన్స్‌ దట్టించి సుకుమార్ రాసిన సన్నివేశాలు కేకపెట్టిస్తాయి. మాస్, మసాలా అంశాలే మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొనే అంశాలు పుష్పలంగా ఉన్నాయి. ఈ సినిమా బాక్సాఫీస్ రేంజ్ ఏంటో కొద్ది రోజుల్లోనే తెలియడం ఖాయం. మస్ట్ వాచ్ మూవీ. డోంట్ మిస్ ఇట్.

Pushpa 2 Telugu movie review
Pushpa 2 review in Telugu language
Pushpa 2 movie review Telugu audience
Pushpa 2 cinema review in Telugu
Telugu review of Pushpa 2 movie
Pushpa 2 review Telugu YouTube
Pushpa 2 Telugu review rating
Pushpa 2 audience review in Telugu
Pushpa 2 public talk in Telugu
Pushpa 2 Allu Arjun review in Telugu

Like and Share
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading