Menu Close

Punyabhumi Nadesam Song Lyrics in Telugu-Major Chandrakanth-1993


పుణ్యభూమి నా దేశం నమో నమామీ
ధన్య భూమి నా దేశం సదా స్మరామీ

పుణ్యభూమి నా దేశం నమో నమామీ
ధన్య భూమి నా దేశం సదా స్మరామీ
నన్ను కన్న నా దేశం నమో నమామీ
అన్నపూర్ణ నా దేశం సదా స్మరామీ
మహామహుల కన్న తల్లి నా దేశం
మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం, నా దేశం
పుణ్యభూమి నా దేశం నమో నమామీ
ధన్య భూమి నా దేశం సదా స్మరామీ

అదిగో ఛత్రపతీ… ధ్వజమెత్తిన ప్రజాపతి
మతోన్మాద శక్తులు చురకత్తులు జడిపిస్తే
మానవతుల మాంగళ్యం మంట కలుపుతుంటే
ఆఆ ఆ, ఆ క్షుద్ర రాజకీయానికి… రుద్రనేత్రుడై లేచి
మాతృభూమి నుదిటిపై నెత్తురు తిలకం దిద్దిన మహా వీరుడు
సార్వభౌముడు

అడుగో అరి భయంకరుడు కట్ట బ్రహ్మన
అది వీరపాండ్య వంశాంకుర సింహ గర్జన
అడుగో అరి భయంకరుడు కట్ట బ్రహ్మన
అది వీరపాండ్య వంశాంకుర సింహ గర్జన

ఒరెయ్..! ఎందుకు కట్టాలిరా శిస్తు..?
నారు పోశావా? నీరు పెట్టావా? కోత కోశావా? కుప్పలూడ్చావా…?
ఒరెయ్…! తెల్ల కుక్క…!
కష్ట జీవుల ముష్టి తిని బ్రతికే నీకు… శిస్తెందుకు కట్టాలి రా..?

అని పెల పెల సంకెళ్ళు తెంచి
స్వరాజ్య పోరాటమెంచి
ఉరికొయ్యల ఉగ్గు పాలు తాగాడు
కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు
పుణ్యభూమి నా దేశం నమో నమామీ
ధన్య భూమి నా దేశం సదా స్మరామీ
నన్ను కన్న నా దేశం నమో నమామీ
అన్నపూర్ణ నా దేశం సదా స్మరామీ

అదిగదిగో అదిగదిగో… ఆకాశం భళ్ళున తెల్లారి
వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి, అగ్గి పిడుగు అల్లూరి

ఎవడురా నా భరత జాతిని… తత్వమడిగిన తుచ్చుడు
ఎవడు ఎవడా పొగరు బట్టిన తెల్ల దొర గాడెవ్వడు
బ్రతుకు తెరువుకు దేశమొచ్చి… బానిసలుగా మమ్మునెంచి
పన్నులడిగే కొమ్ములొచ్చిన… దమ్ములెవడికి వచ్చెరా
బడుగు జీవులు భగ్గుమంటే… ఉడుకు నెత్తురు ఉప్పెనైతే
ఆ చండ్ర నిప్పుల గండ్ర గొడ్డలి… పన్ను కడతది చూడరా

అన్న, ఆ మన్నెం దొర అల్లూరిని
చుట్టు ముట్టి మంది మార్బలమెట్టి
మర ఫిరంగులెక్కు పెట్టి
వంద గుళ్ళు ఒక్కసారి పేల్చితే
వందేమాతరం… వందేమాతరం
వందేమాతరం… వందేమాతరం
వందేమాతరం అన్నది ఆ ఆకాశం

ఆజాదు హిందు ఫౌజు దళపతి నేతాజి
అఖండ భరత జాతి కన్న మరో శివాజి
సాయుధ సంగ్రామమే న్యాయమని
స్వతంత్ర భారతావని మన స్వర్గమని
ప్రతి మనిషొక సైనికుడై ప్రాణార్పన చెయ్యాలని
హిందు ఫౌజు జైహింద్ అని గడిపాడు
గగన సిగలకెగసి కనుమరుగై పోయడు
జోహార్ జోహార్… సుభాష్ చంద్ర బోస్
జోహార్ జోహార్… సుభాష్ చంద్ర బోస్

గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం
సాదించే సమరంలో అమర జ్యోతులై వెలిగే
ద్రువతారల కన్నది ఈ దేశం
చరితార్దులకన్నది నా భారత దేశం, నా దేశం

పుణ్యభూమి నా దేశం నమో నమామీ
ధన్య భూమి నా దేశం సదా స్మరామీ
నన్ను కన్న నా దేశం నమో నమామీ
అన్నపూర్ణ నా దేశం సదా స్మరామీ

Like and Share
+1
0
+1
0
+1
0
Posted in Lyrics in Telugu - Movie Songs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading