Menu Close

Chittigumma Padave Song Lyrics In Telugu-Tholi Muddhu-1993

చిట్టిగుమ్మ పదవే
రెండు రెక్కలు కట్టుకుందాం
వెండి మబ్బు ఒడిలో
ముద్దు ముచ్చటలాడుకుందాం

చిరుగాలై కొండా కొనల్లోన తేలీ
చిరునవ్వై పూల గుండెల్లోన దాగాలీ
చిరుగాలై కొండా కొనల్లోన తేలీ
చిరునవ్వై పూల గుండెల్లోన దాగాలీ
చిట్టిగుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుందాం
వెండి మబ్బు ఒడిలో… ముద్దు ముచ్చటలాడుకుందాం

కడలీ అంచుల్లో జలకాలాడీ
అలల అంతుపొంతూ చూసొద్దామా
యమహొ ముందో ముద్దు లాగిద్దామా
తొలికే వెన్నెల్లో సరసాలాడీ
వయసు హద్దు పొద్దు తేలుద్దామా, ఆ
త్వరగా అస్సు బుస్సు కానిద్దామా

తరగని మోహలే వేసాయి వలలూ
తడి తడి ఒంపుల్లో పిల్లోడా
అరగని అందాలే పొంగాయి సడిలో
పెదవుల తాంబూలం అందీవే
చనువిచ్చేయమంటొందీ… మనసొద్దద్దంటొందీ
ఇక సిగ్గేమంటూ కొమ్మారెమ్మా ఊగాడిందీ

చిట్టిగుమ్మ పదవే… రెండు రెక్కలు కట్టుకుందాం
వెండి మబ్బు ఒడిలో… ముద్దు ముచ్చటలాడుకుందాం
చిరుగాలై కొండా కొనల్లోన తేలీ
చిరునవ్వై పూల గుండెల్లోన దాగాలీ
చిట్టిగుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుందాం
వెండి మబ్బు ఒడిలో ముద్దు ముచ్చటలాడుకుందాం

చలిలో చిన్నారీ వయ్యారాలే
కసిగా గుచ్చి గుచ్చి ఊరిస్తుంటే
ఉసిగా తట్టి తట్టీ వేధిస్తుంటే
వలపుల కౌగిళ్ళ నజరానాలే
రతిలా మళ్ళీ మళ్ళీ అందిస్తుంటే
మరుడే ఒళ్ళోకొచ్చి కవ్విస్తుంటే

తెలియని ఆవేశం రేగిందే మదిలో
తలుపులు తీయవేమే బుల్లెమ్మా
పరువపు ఆరాటం తీరాలీ జడిలో
తకధిమి సాగించేయ్ బుల్లోడా
ఇహ అడ్డేముందమ్మో… మలి ముద్దిచ్చేయవమ్మో
మెరుపల్లే బాణం సంధిచెయ్రా వీరా ధీరా

చిట్టిగుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుందాం
వెండి మబ్బు ఒడిలో ముద్దు ముచ్చటలాడుకుందాం
చిరుగాలై కొండా కొనల్లోన తేలీ
చిరునవ్వై పూల గుండెల్లోన దాగాలీ
చిరుగాలై కొండా కొనల్లోన తేలీ
చిరునవ్వై పూల గుండెల్లోన దాగాలీ
చిట్టిగుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుందాం
వెండి మబ్బు ఒడిలో ముద్దు ముచ్చటలాడుకుందాం

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading