ఎవ్వరు మాపై నిన్నే ఎగదోస్తారమ్మా
ఎవ్వరి ఎదలను వదలక వేధిస్తావమ్మా
ఎందరి మనసులతోటి ఆటాడేవమ్మా
ఎపుడు మాపై నీదే పైచేయి ప్రేమ
ప్రేమంటే చావేనా అసలైన అర్ధం
ప్రేమికులపైనేనా నువు చేసే యుద్ధం
ప్రేమ ప్రేమ ఏంటి నీ జన్మ
ప్రేమంటే చితిలో మంటేనా
ప్రేమంటే మరణం అంతేనా
ప్రేమిస్తే చీకటి వెంటేనా ఇంతేనా
నాకైతే మరణం లేదంటూ
నమ్మించి హృదయంలో ఉంటూ
జంటలలో మంటలనే రేపే ఓ ప్రేమ, ఓ ప్రేమ
రోజు నడిచే దారే
ముళ్ల కంపల్లే ఇవ్వాలె తోచిందే
ప్రతి రోజు చూసే ఊరే
వల్లకాడల్లే ఈరోజే నవ్విందే
నీ జతలో బతుకంతా సంక్రాంతై వెలిగిందిలే
నువ్వెళుతూ నాకళ్ళా వాకిల్లో
కన్నీళ్ళ కల్లాపి చల్లేసి పోయావులే
ప్రేమంటే చితిలో మంటేనా
ప్రేమంటే మరణం అంతేనా
ప్రేమిస్తే చీకటి వెంటేనా ఇంతేనా
నాకైతే మరణం లేదంటూ
నమ్మించి హృదయంలో ఉంటూ
జంటలలో మంటలనే రేపే ఓ ప్రేమ, ఓ ప్రేమ
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.