అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
ఓ ప్రేమ కథ – Prema Kathalu – Telugu Love Stories
ఒక అబ్బాయి ఓ అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు, ఒక రోజు కూడా ఆమెను చూడకుండా ఉండలేకపోయేవాడు. ఒక రోజు ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి ‘ఐ లవ్ యు’ అని తన మనసులో మాట చెప్పాడు. దానికి ఆ అమ్మాయి సమాధానం చెప్పకుండా సరే ముందు నువ్వు ‘నన్ను చూడకుండా ఒక రోజు గడుపు’ ఆ తరవాత నేను నీకు సమాధానం చెప్తాను అని అంది.
సరే అన్నాడు అబ్బాయి. అమ్మాయిని చూడకుండా ఒక రోజు మొత్తం గడిపేశాడు. మరుసటి రోజు ఆ అమ్మాయిని చూడడానికి వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చాడు, అక్కడ ఏడుపులు తప్ప మరేం వినపడటం లేదు ఆ అబ్బాయికి.
ఆ అమ్మాయి చనిపోయింది..!! ఆ అమ్మాయికి తెలుసు ఆమె మరో 24 గంటలు మాత్రమే బ్రతుకుతుందని. ఆమె చనిపోయే ముందు అబ్బాయికి రాసిన ఉత్తరంలో ఇలా ఉంది..! “నన్ను చూడకుండా నువ్వు ఒక్క రోజు ఉండగలిగావు. ప్రతిరోజు నువ్వు ఇలాగే ఉండాలని ఆశిస్తున్నాను.. “ఐ మిస్ యు” !!
ఆ అబ్బాయి గుండె పగిలిపోయినంత పని అయింది,
తట్టుకోలేక ఉన్నచోటే కుప్పకూలిపోయాడు. ఒక్కసారిగా అగ్నిపర్వతం బద్దలైనట్టుగా అతని బాధ బయట పడింది.
ఆమె జ్ఞాపకాలు మాత్రమే అతనికి తోడు మిగిలాయి😢😢
