Menu Close

Prasnante Song Lyrics In Telugu – Karthikeya

అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి

ప్రశ్నంటే నింగినే నిలదీసే అల
ప్రశ్నించే లక్షణం లేకుంటే ఎలా
బదులంటే ఎక్కడో… ఏ చోటో లేదురా
శోధించే చూపులో… ఓ నలుపై గెలుపై దాగుందంట

ప్రతి ఒక రోజిలా ఒకటే మూసగా
బ్రతుకును లాగటం బరువేగా మనసుకి
సరికొత్త క్షణాలకై వెతికే దారిగా
అడుగులు కదుపుతూ పయనిద్దాం ప్రగతికీ
ప్రశ్నంటే..! ప్రశ్నంటే నింగినే నిలదీసే అల
ప్రశ్నించే లక్షణం లేకుంటే ఎలా

పలు రంగులు దాగి లేవా… పైక్కనిపించే తెలుపులోన
చిమ్మ చీకటి ముసుగులోను… నీడలు ఎన్నో ఉండవా
అడగనిదే ఏ జవాబు… తనకై తానెదురుకాదు
అద్భుతమే దొరుకుతుంది అన్వేషించరా

ప్రతి ఒక రోజిలా ఒకటే మూసగా
బ్రతుకును లాగటం బరువేగా మనసుకి
సరికొత్త క్షణాలకై వెతికే దారిగా
అడుగులు కదుపుతూ పయనిద్దాం ప్రగతికీ
ప్రశ్నంటే..! ప్రశ్నంటే నింగినే నిలదీసే అల
ప్రశ్నించే లక్షణం లేకుంటే ఎలా

ఎపుడో ఎన్నేళ్ళనాడో… నాందిగా మొదలైన వేట
ఎదిగే ప్రతి మలుపుతోను… మార్చలేదా మనిషి బాట
తెలియని తనమే పునాది… తెలిసిన క్షణమే ఉగాది
తెలివికి గిరిగీత ఏది..! ప్రయత్నించరా

ప్రతి ఒక రోజిలా ఒకటే మూసగా
బ్రతుకును లాగటం బరువేగా మనసుకి
సరికొత్త క్షణాలకై వెతికే దారిగా
అడుగులు కదుపుతూ పయనిద్దాం ప్రగతికీ
ప్రశ్నంటే..! ప్రశ్నంటే నింగినే నిలదీసే అల
ప్రశ్నించే లక్షణం లేకుంటే ఎలా

Like and Share
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading