పూల ఘుమఘుమ చేరని… ఓ మూల ఉంటే ఎలా
తేనె మధురిమ చేదని… ఆ మూతిముడుపేంటలా
ప్రేమంటే పామని బెదరాలా… ధీమాగా తిరగర మగరాయడా
భామంటే చూడని వ్రతమేలా… పంతాలే చాలుర ప్రవరాఖ్యుడా
మారనే మారవా మారమే మానవా
మౌనివా మానువా తేల్చుకో మానవా
పూల ఘుమఘుమ చేరని… ఓ మూల ఉంటే ఎలా
తేనె మధురిమ చేదని… ఆ మూతిముడుపేంటలా
చెలి తీగకి ఆధారమై బంధమై అల్లుకో
దరికొచ్చి అరవిచ్చి అరవిందమయ్యే అందమే అందుకో
మునిపంటితో నా పెదవిపై మల్లెలే తుంచుకో
నా వాలు జడ చుట్టుకొని మొగిలిరేక… నడుము నడిపించుకో
వయసులో పరవశం చూపుగా చేసుకో
సొగసులో పరిమళం శ్వాసగా తీసుకో
పూల ఘుమఘుమ చేరని… ఓ మూల ఉంటే ఎలా
తేనె మధురిమ చేదని… ఆ మూతిముడుపేంటలా
ప్రతి ముద్దుతో ఉదయించనీ కొత్త పున్నాగనై
జతలీలలో అలసి మత్తెక్కిపోనీ నిద్ర గన్నేరునై
నీ గుండెపై ఒదిగుండనీ పొగడ పూదండనై
నీ కంటి కోనేట కొలువుండిపోనీ చెలిమి చెంగలువనై
మోజులే జాజులై పోయనీ హాయిని
తాపమే తుమ్మెదై తీయనీ తేనెనీ
పూల ఘుమఘుమ చేరని… ఓ మూల ఉంటే ఎలా
తేనె మధురిమ చేదని… ఆ మూతిముడుపేంటలా
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.