ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
పోనీ పోనీ ఈ ప్రాణమే
కలకై జరిగే ఓ త్యాగమే
ప్రేమే చిందించే రక్తమే
కలకందించే ఆరాధనే
హృదయమే అణువణువున
ఊపిరై నిను నిలిపినా
ప్రణయమే తను నిలువునా
పతనమై పోవాలి సుమా
మనసు విరిచి ఆ మంటలపై
ఆశల దహనం నేనిక చేయుటెలా
గుండె చిదిమి ఆ గురుతులపై
ఆశయ రథమై కదలాలి తప్పదిక
కలకే బ్రతికే దారి చూపించరా
కరుణే కలిగి కర్కసుడివవ్వరా
వలపే విషమై మారిపోనివ్వరా
మనవిని వినరా మరణమే ఇవ్వరా
రెక్కతెగిన ఒక గువ్వనురా
ప్రేమల తీరం నే చేరలేను కదా
ముక్కలైన నా హృదయమిక
మరుజన్మైనా నీకే అర్పించెదరా
Like and Share
+1
+1
1
+1