Piliche Pedhavula Paina Lyrics in Telugu – Khaleja
మీఠీ మీఠీ ధూన్ ఓ భాజాయే
రాధకే మన్ ఖోలుబాయే
గోపి భోలే గిరిధర్ నందలాలా నందలాలా
మీఠీ మీఠీ ధూన్ ఓ భాజాయే
హే రాధకే మన్ ఖోలుబాయే
ఏ గోపి భోలే గిరిధర్ నందలాలా నందలాలా
గోపి భోలే గిరిధర్ నందలాలా
పిలిచే పెదవుల పైన
నిలిచే మెరుపు నువ్వేనా
పిలిచే పెదవుల పైన
నిలిచే మెరుపు నువ్వేనా
నువ్వు చేరి నడి ఎడారి నందనమై విరిసిందా
తనలో ఆనంద లహరి సందడిగా ఎగసిందా
నడిచిన ప్రతి దారి నది గ మారి మురిసినదా ముకుందా
కాలం నేను మరచి జ్ఞపకాలో జారిపోయిందా
లోకం గోకులం ల మారిపోయి మాయ జరిగిందా
ఊరంతా ఊగిందా నీ చంతా చేరిందా గోవిందా
పిలిచే పెదవుల పైన
నిలిచే మెరుపు నువ్వేనా
ఈ భావం నాదేనా ఈనాడే తోచేనా
చిరునవ్వోటి పూసింది నా వల్లనా
అది నావెంటే వస్తుంది ఎటు వెళ్లినా
మనసులో ముంచెనా మురిపించేనా మధురమే ఈ లీల
నాలో ఇంతకాలం వున్నా మౌనం ఆలపించిందా
ఏకాంతాన ప్రాణం బృందగానం ఆలకించిందా
ఊరంతా ఊగిందా నీ చంతా చేరిందా గోవిందా
జుమో రే జుమో రే జుమో రే ఓ గిరిధర్
జుమో రే జుమో రే జుమో రే ఓ గిరిధర్
జుమో రే జుమో రే జుమో రే ఓ గిరిధర్
జుమో రే జుమో రే జుమో రే
జుమో రే జుమో రే జుమో రే ఓ గిరిధర్
జుమో రే జుమో రే జుమో రే ఓ గిరిధర్
జుమో రే జుమో రే జుమో రే ఓ గిరిధర్
జుమో రే జుమో రే జుమో రే
మరో మురళి భాజావే గిరిధర్ గోపాలా
భాజాకె మనుఖో చురాలే గిరిధ నందలాలా
నా చూపే చెదిరిందా నీ వైపే తరిమిందా
చిన్ని క్రిష్నయ్య పాదాల సిరి మువ్వలా
నన్ను నీ మాయ నడిపింది నాలు వైపులా
అలజడి పెంచేనా అలరించేనా లాలనను ఈ వేళా
ఏదో ఇంద్రజాలం మంత్రమేసి నన్ను రమ్మందా
ఎదలో వేణు నాదం ఉయ్యాలూపి ఊహ రేపిందా
ఊరంతా ఊగిందా నీ చంతా చేరిందా గోవిందా
పిలిచే పెదవుల పైన
నిలిచే మెరుపు నువ్వేనా