ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
పూర్తిగా చదవండి, నచ్చితే తప్పకుండా షేర్ చెయ్యండి.
అమ్మాయ్: ఎం చేస్తారు మీరు?
అబ్బాయ్: మా ఊర్లో చెట్టుకింద కూర్చుని కాలక్షేపం చేస్తూ ఉంటాను .
నెలకు 3000 నిరుద్యోగ భృతి వస్తుంది.
రోజుకి 100 అన్నమాట..
10 రూ సమోస, రోజుకు రెండు టీ 10 రూ, 3 సిగరెట్లు 30 రూ…
మొత్తం 50 ఖర్చుపెడతాను.
రోజుకు 50 రూ సేవింగ్ ఎకౌంట్ లో సేవ్ చేస్తాను.
మీరు ఏం చేస్తారు?
అమ్మాయ్: డ్వాక్రా మెంబర్ ని.
20 వేల రుణం వస్తుంది సంవత్సరానికి.
గత ఎన్నికల్లో అప్పారావు గారు ఇచ్చిన కుట్టు మిషన్ ఉంది.
దాంతో పార్టీ జెండాలు కుడతాను.
అంకుల్ ఏం చేస్తారు?
అబ్బాయ్: డాడీకి వ్రద్దాప్య పింఛన్ 4000 వస్తుంది…
ఈసారి వాళ్ళు 6000 ఇస్తామంటున్నారు.
వారికి ఒటేద్దామనుకుంటున్నాం.
మీ డాడీ ఎం చేస్తారు…?
అమ్మాయ్: ఆ…మా డాడీ మాత్రం కలెక్టరా?
ఆయనకి 4000 పింఛన్ వస్తుంది.
4000 కి ఏం వస్తుంది ఈ రోజుల్లో?
10,000 ఇస్తే వారికి ఓటేద్దాం అనుకుంటున్నాం.
అబ్బాయ్: ఆంటీ ఎం చేస్తారు?
అమ్మాయ్: అమ్మ నగలు బ్యాంక్ లో పెట్టాం.
బాబు రుణం మాఫీ చేస్తానని చెప్పాడు.
ఇంతవరకు చెయ్యలేదు.
బ్యాంక్ వారు నగలు వేలం వేస్తామంటున్నారు.
మమ్మీ ఏడుస్తూ కూర్చుంది.
మీ మమ్మీ ఏం చేస్తుంది?
అబ్బాయ్: మీ మమ్మీలాగే మా మమ్మీ…సేం టూ సేం.
అమ్మాయ్: ఇళ్లు సొంతదేనా?
అబ్బాయ్: మా అమ్మమ్మ ఇందిరమ్మ ఇచ్చిన ఇల్లు…
ఈసారి గెలిస్తే… మరొక గది వేసుకోటానికి 2 లచ్చలు ఇస్తారట.
దాంతో బైక్ కొందామనుకుంటున్నా?
మీ ఇల్లు ఓనా?
అమ్మాయ్: మా తాత NTR ఇల్లోకటి ఇస్తానన్నాడు, వస్తుంది ష్యూర్ గా.
అబ్బాయ్: ఓ…కంగ్రాట్ష్యులేషన్స్… మీరు నాకు నచ్చారు.
ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం?
నేను రోజు సేవింగ్ చేసే 50 రూపాయలు.
నెలకు 1500 నీ చేతిలో పెడతా…
నీ ఇష్టం వచ్చినట్లు వాడుకో, ఎంజాయ్.
అమ్మాయ్: నాకు పక్క రాష్ట్రం ఎన్నికలు అయ్యేవరకు టైం కావాలి…
పక్క రాష్ట్రం అబ్బాయ్ సంబంధం ఒకటి వచ్చింది…
ఎన్నికలు అయ్యాక వాళ్ళ రాష్ట్రంలో పదెకరాల పొలం..
10 వేలు నిరుద్యోగ భృతి ఇస్తారట.
విల్లా కూడా ఒకటి ఇస్తారట.
Latest Telugu Jokes on Elections, Pelli Choopulu Jokes in Telugu, Telugu Jokes on Marriage.