ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
పరవశమే…! పరవశమే…!
ప్రతి నిమిషం… ప్రియ మధుమాసమే
పరవశమే…! పరవశమే…!
ప్రతి నిమిషం… ప్రియ మధుమాసమే
ఆ హా అంటోంది… నా సంబరం
ఒడిలో వాలింది… నీలాంబరం
మనసే పసి పావురం… వలపే తన గోపురం
వెతికీ కలిసెను… నిన్నీక్షణం
కథలో మలుపీస్వరం… కలలో నిజమీ వరం
అలలై ఎగసెను కోలాహలం
పరవశమే…! పరవశమే…!
ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే
పరవశమే…! పరవశమే…!
ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే
నింగీ నీలం… ఆకూ పచ్చ
నువ్వూ నేనూ జంట… విడిపోమూ
అలుకూ రాగం… మెరుపూ మేఘం
దేహం ప్రాణం… మనమై కలిశామూ
జతగా ప్రతి జన్మకి… నువ్వే చెలి జానకి
నీలో సగమై జీవించనీ
ఎదలో సహవాసమై… వ్యధలో వనవాసమై
నీతో నీడై పయనించనీ
ఆ హా అంటోంది… నా సంబరం
ఒడిలో వాలింది… నీలాంబరం
మనసే పసి పావురం… వలపే తన గోపురం
వెతికీ కలిసెను… నిన్నీక్షణం
కథలో మలుపీస్వరం… కలలో నిజమీ వరం
అలలై ఎగసెను కోలాహలం
పరవశమే…! పరవశమే…!
ప్రతి నిమిషం… ప్రియ మధుమాసమే
పరవశమే…! పరవశమే…!
ప్రతి నిమిషం… ప్రియ మధుమాసమే