Pandagala Digivachavu Song Lyrics In Telugu – Mirchi – పండగలా దిగివచ్చావు లిరిక్స్
పండగలా దిగివచ్చావు… ప్రాణాలకు వెలుగిచ్చావు
రక్తాన్నె ఎరుపెక్కించావు
మా తోడుకు తోడయ్యావు… మా నీడకు నీడయ్యావు
మా అయ్యకు అండై నిలిచావు
పండగలా దిగివచ్చావు… ప్రాణాలకు వెలుగిచ్చావు
రక్తాన్నె ఎరుపెక్కించావు
మా తోడుకు తోడయ్యావు… మా నీడకు నీడయ్యావు
మా అయ్యకు అండై నిలిచావు
అయ్యంటే ఆనందం… అయ్యంటె సంతోషం
మా అయ్యకు అయ్యై నువు
కలిసొచ్చిన ఈ కాలం… వరమిచ్చిన ఉల్లాసం
ఇట్టాగే పదికాలాలు ఉండనివ్వు
పండగలా దిగివచ్చావు… ప్రాణాలకు వెలుగిచ్చావు
రక్తాన్నె ఎరుపెక్కించావు
మా తోడుకు తోడయ్యావు… మా నీడకు నీడయ్యావు
మా అయ్యకు అండై నిలిచావు
ఓ, జోలాలి అనలేదే చిననాడు నిన్నెప్పుడు… ఈ ఊరి ఉయ్యాల
ఓఓ, నీ పాదం ముద్దాడి… పులకించి పోయిందే ఈ నేల ఇయ్యాలా
మా పల్లే బతుకుల్లో, మా తిండి మెతుకుల్లో… నీ ప్రేమే నిండాల
ఓ మా పిల్లా పాపల్లో, మా ఇంటి దీపాల్లో… నీ నవ్వె చూడాలా
గుండె కలిగిన గుణము కలిగిన… అయ్య కొడుకువుగా
వేరు మూలము వెతికి… మా జత చేరినావు ఇలా
పండగలా దిగివచ్చావు… ప్రాణాలకు వెలుగిచ్చావు
రక్తాన్నె ఎరుపెక్కించావు
మా తోడుకు తోడయ్యావు… మా నీడకు నీడయ్యావు
మా అయ్యకు అండై నిలిచావు
ఓ, పెదవుల్లో వెన్నెల్లూ, గుండెల్లో కన్నీళ్ళు… ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు
ఓఓ, అచ్చంగా నీవల్లే, మా సామి కల్లల్లో… చూసామీ తిరునాళ్ళు
ఏ దైవం పంపాడో, నువ్వొచ్చిన వెలుగుల్లో… మురిసాయి ముంగిళ్ళు
మా పుణ్యం పండేలా ఈ పైన మేమంతా… మీ వాల్లు అయినోళ్ళు
అడుగు మోపిన నిన్ను చూసి… అదిరె పలనాడు
ఇక అలుగు దాటి బయట పడగ… బెదరడ పగవాడు
పండగలా దిగివచ్చావు… ప్రాణాలకు వెలుగిచ్చావు
రక్తాన్నె ఎరుపెక్కించావు
మా తోడుకు తోడయ్యావు… మా నీడకు నీడయ్యావు
మా అయ్యకు అండై నిలిచావు.. ..
Pandagala Digivachavu Song Lyrics In Telugu – Mirchi – పండగలా దిగివచ్చావు లిరిక్స్
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.