ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Panchavannela Chilaka Nannu Song Lyrics In Telugu – Subhakankshalu
ఎర్రా ఎర్రాని చూపు ఎంటాడెనమ్మా
సుర్రు సుర్రూన కైపు చిర్రెక్కెనమ్మా
ఎర్రా ఎర్రాని రూపు ఎదురొచ్చేనమ్మా
సుర్రు సుర్రూన కైపు కిర్రెక్కెనమ్మా
కిర్రెక్కెనమ్మా కిర్రెక్కెనమ్మా
పంచవన్నెల చిలక నన్ను ఎంచుకుందిరా
పంచదార వలపు పెట్టి పెంచమందిరా
పంచవన్నెల చిలక నిన్ను ఎంచుకుందిరా
పంచదార వలపు పెట్టి పెంచకుందిరా
అరె, ముచ్చటైన ఊసు ఉంది… మొక్కజొన్న తోటకాడ
వచ్చిపోవే ఒక్కసారి… వాటమైన సందె కాడ
ముచ్చటైన ఊసు ఉంది… మొక్కజొన్న తోటకాడ
వచ్చిపోవే ఒక్కసారి… వాటమైన సందెకాడ
పంచవన్నెల చిలక నిన్ను ఎంచుకుందిరా
పంచదార వలపు పెట్టి పెంచుకుందిరా
పంచవన్నెల చిలక నిన్ను ఎంచుకుందిరా
పంచదార వలపు పెట్టి పెంచుకుందిరా
కళ్ళముందు ఘల్లుమంటూ… పిల్ల ఎంకి చిందులాడ
మబ్బుచాటు నుంచి రాడు… చందురూడు తొంగిచూడ
పంచవన్నెల చిలక నన్ను ఎంచుకుందిరా
పంచదార వలపు పెట్టి పెంచమందిరా
కన్నుకొట్టెరో కూనా కన్నుకొట్టేరో
కన్నుకొట్టి కుర్ర ఈడు వెన్నుతట్టేరో
కన్నుకొట్టరా కన్నా కన్నుకొట్టరా
కన్నుకొట్టి కుర్రదాని వెన్నుతట్టరా
రివ్వు రివ్వుమంటూ గువ్వ… గుండెలోన వాలేనంట
పువ్వులాగా చూసుకుంటే… జంటవీడి వెళ్ళదంట
రివ్వు రివ్వుమంటూ గువ్వ… గుండెలోన వాలేనంట
పువ్వులాగా చూసుకుంటే… జంటవీడి వెళ్ళదంట
పంచవన్నెల చిలక నిన్ను ఎంచుకుందిరా
పంచదార వలపు పెట్టి పెంచుకుందిరా
పంచవన్నెల చిలక నన్ను ఎంచుకుందిరా
పంచదార వలపు పెట్టి పెంచమందిరా, అహ్హా
పంచవన్నెల చిలక నిన్ను ఎంచుకుందిరా
పంచదార వలపు పెట్టి పెంచకుందిరా
అరె, ముచ్చటైన ఊసు ఉంది… మొక్కజొన్న తోటకాడ
వచ్చిపోవే ఒక్కసారి… వాటమైన సందెకాడ
ముచ్చటైన ఊసు ఉంది… మొక్కజొన్న తోటకాడ
వచ్చిపోవే ఒక్కసారి… వాటమైన సందెకాడ
పంచవన్నెల చిలక నిన్ను ఎంచుకుందిరా
పంచదార వలపు పెట్టి పెంచుకుందిరా