Menu Close

మ్యూజిక్ ప్రియులకి మంచి ఇయర్ బడ్స్
తక్కువ బడ్జెట్ లో అమెజాన్ ఆఫర్ 👇

Buy Now

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Panchadara Bomma Bomma Song Lyrics In Telugu – పంచదారా బొమ్మా

Panchadara Bomma Bomma Song Lyrics In Telugu – పంచదారా బొమ్మా

పంచదారా బొమ్మా బొమ్మా… పట్టుకోవద్దనకమ్మా
మంచుపూలా కొమ్మా కొమ్మా… ముట్టుకోవద్దనకమ్మా
చేతినే తాకొద్దంటే… చెంతకే రావొద్దంటే, ఏమవుతానమ్మా
నిను పొందేటందుకె పుట్టానే గుమ్మ
నువు అందకపోతే వృధా ఈ జన్మ
నిను పొందేటందుకె పుట్టానే గుమ్మ
నువు అందకపోతే వృధా ఈ జన్మ… ఆఆ ఆఆ ఆ

పువ్వు పైన చెయ్యేస్తే… కసిరి నన్ను తిట్టిందే
పసిడిపువ్వు నువ్వని పంపిందే
నువ్వు రాకు నా వెంట… ఈ పువ్వు చుట్టు ముళ్లంటా
అంటుకుంటే మంటే ఒళ్ళంతా

తీగపైన చెయ్యేస్తే… తిట్టి నన్ను నెట్టిందే
మెరుపు తీగ నువ్వని పంపిందే
మెరుపు వెంట ఉరుమంటా… ఉరుము వెంట వరదంటా
నే వరద లాగా మారితే ముప్పంటా
వరదైనా వరమని వరిస్తానమ్మా
మునకైనా సుఖమని ముడేస్తానమ్మా
నిను పొందేటందుకె పుట్టానే గుమ్మ
నువు అందకపోతే వృధా ఈ జన్మ… ఆఆ ఆ

గాలి నిన్ను తాకింది… నేల నిన్ను తాకింది
నేను నిన్ను తాకితే తప్పా
గాలి ఊపిరయ్యింది… నేల నన్ను నడిపింది
ఏమిటంట నీలోని గొప్ప
వెలుగు నిన్ను తాకింది… చినుకు కూడ తాకింది
పక్షపాతమెందుకు నాపైనా
వెలుగు దారి చూపింది… చినుకు లాల పోసింది
వాటితోటి పోలిక నీకేలా

అవి బ్రతికున్నప్పుడే తోడుంటాయమ్మా
నీ చితిలో తోడై నేనొస్తానమ్మా
నిను పొందేటందుకె పుట్టానే గుమ్మ
నువు అందకపోతే వృధా ఈ జన్మ… ఆఆ ఆ.. ..

Panchadara Bomma Bomma Song Lyrics In Telugu – పంచదారా బొమ్మా

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading

Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images Krithi Shetty Latest Images – Hot & Cute Rashmika Mandanna HOT Looks