Menu Close

Okate Jananam Okate Maranam Lyrics in Telugu – Bhadrachalam – ఒకటే జననం ఒకటే మరణం లిరిక్స్

Okate Jananam Okate Maranam Lyrics in Telugu – Bhadrachalam – ఒకటే జననం ఒకటే మరణం లిరిక్స్

ఒకటే జననం ఒకటే మరణం…
ఒకటే గమనం ఒకటే గమ్యం…
గెలుపు పొందె వరకూ… అలుపు లేదు మనకు
బ్రతుకు అంటె గెలుపూ… గెలుపు కొరకె బ్రతుకు

కష్టాలురానీ కన్నీళ్లురానీ… ఏమైనాగానీ ఎదురేదిరానీ
ఓడిపోవద్దు రాజీపడొద్దు… నిద్రే నీకొద్దు నింగి నీ హద్దు…

ఒకటే జననం ఒకటే మరణం…
ఒకటే గమనం ఒకటే గమ్యం…
గెలుపు పొందె వరకూ… అలుపు లేదు మనకు
బ్రతుకు అంటె గెలుపూ… గెలుపు కొరకె బ్రతుకు

రాబోయే విజయాన్ని… పిడికిలిలో చూడాలి
ఆ గెలుపూ చప్పట్లే… గుండెలలో మోగాలి

నీ నుదిటీ రేఖలపై… సంతకమే చేస్తున్నా
ఎదనిండా చిరునవ్వే… చిరునామై ఉంటున్నా
నిన్నే వీడని నీడవలే… నీతో ఉంటా ఓ నేస్తం
నమ్మకమే మనకున్న బలం…

నీలి కళ్ళల్లో మెరుపే మెరవాలి… కారు చీకట్లో దారి వెతకాలి
గాలివానల్లో ఉరుమై సాగాలి… తగిలే గాయాల్లో ధ్యేయం చూడాలి

ఒకటే జననం ఒకటే మరణం…
ఒకటే గమనం ఒకటే గమ్యం…
గెలుపు పొందె వరకూ… అలుపు లేదు మనకు
బ్రతుకు అంటె గెలుపూ… గెలుపు కొరకె బ్రతుకు

నిదరోకా నిలుచుంటా… వెన్నెలలో చెట్టువలె
నీ కోసం వేచుంటా… కన్నీటి బొట్టువలె
అడుగడుగూ నీ గుండె… గడియారం నేనవుతా…
నువు నడిచే దారులలో… ఎదురొచ్చి శుభమవుతా…

రాశిగ పోసిన కలలన్నీ… దోసిలి నిండా నింపిస్తా
చేతులు సాచిన స్నేహంలా…

ముట్టుకున్నావా… మువ్వా అవుతుంది
పట్టుకున్నావా… పాటే అవుతుంది
అల్లుకున్నావా… జల్లే అవుతుంది
హత్తుకున్నావా… వెల్లువౌతుంది

ఒకటే జననం ఒకటే మరణం…
ఒకటే గమనం ఒకటే గమ్యం…
గెలుపు పొందె వరకూ… అలుపు లేదు మనకు
బ్రతుకు అంటె గెలుపూ… గెలుపు కొరకె బ్రతుకు.. ..

Okate Jananam Okate Maranam Lyrics in Telugu – Bhadrachalam – ఒకటే జననం ఒకటే మరణం లిరిక్స్, Inspiring Telugu Songs, Motivational Telugu Songs

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading