ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Pallavinchava Naa Gonthulo Lyrics In Telugu – Kokilamma
పల్లవించవా నా గొంతులో… పల్లవి కావా నా పాటలో
పల్లవించవా నా గొంతులో… పల్లవి కావా నా పాటలో
ప్రణయ సుధా రాగా… నా బ్రతుకు నీది కాదా… ఆఆ ఆ
పల్లవించవా నా గొంతులో… పల్లవి కావా నా పాటలో
నేనున్నది నీలోనే… ఆ నేను నీవేలే
నాదన్నది ఏమున్నది నాలో… నీవేనాడో మలిచావు ఈ రాతిని
నేనీనాడు పలకాలి… నీ గీతినీ
నేనున్నది నీలోనే… ఆ నేను నీవేలే
నాదన్నది ఏమున్నది నాలో… నీవేనాడో మలిచావు ఈ రాతిని
నేనీనాడు పలకాలి… నీ గీతినీ
ఇదే నాకు తపమని… ఇదే నాకు వరమని
ఇదే నాకు తపమని… ఇదే నాకు వరమని
చెప్పాలని ఉంది… గుండె విప్పాలని ఉంది
చెప్పాలని ఉంది… గుండె విప్పాలని ఉంది
పల్లవించవా నా గొంతులో… పల్లవి కావా నా పాటలో
నీ ప్రేమకు కలశాన్ని… నీ పూజకి నిలయాన్ని
నీ వీణకు నాదాన్ని కానా…
నే ఇన్నాళ్ళు చేసింది… ఆరాధనా
నీకు ఈనాడు తెలిపేది… నా వేదన
నీ ప్రేమకు కలశాన్ని… నీ పూజకి నిలయాన్ని
నీ వీణకు నాదాన్ని కానా…
నే ఇన్నాళ్ళు చేసింది… ఆరాధనా
నీకు ఈనాడు తెలిపేది… నా వేదన
ఇదే నిన్ను వినమని… ఇదే నిజం అనమని
ఇదే నిన్ను వినమని… ఇదే నిజం అనమని
చెప్పాలని ఉంది… గుండె విప్పాలని ఉంది
చెప్పాలని ఉంది… గుండె విప్పాలని ఉంది
పల్లవించవా నా గొంతులో… పల్లవి కావా నా పాటలో
ప్రణయ సుధా రాగా…ఆ ఆఆ
నా బ్రతుకు నీది కాదా… ఆఆ ఆ
పల్లవించవా నా గొంతులో… పల్లవి కావా నా పాటలో