ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Pagale Vennela Jagame Uyala Lyrics In Telugu – Pooja Phalam
ఆఆ ఆ ఆఆ ఆ ఆ ఆ ఆ ఆ… ఆ ఆ ఆ ఆ ఆఆఆఆ ఆ
పగలే వెన్నెలా జగమే ఊయల
కదలె ఊహలకే కన్నులుంటే, ఏఏ ఏ ఏఏ ఏ
పగలే వెన్నెలా జగమే ఊయల
నింగిలోన చందమామ తోంగి చూచే
నీటిలోన కలువభామ పొంగి పూచే, ఏఏ ఏ ఏఏ
ఈ అనురాగమే జీవనరాగమై
ఈ అనురాగమే జీవనరాగమై
ఎదలో తేనేజల్లు కురిసిపోదా, ఆఆ ఆ ఆ
పగలే వెన్నెలా జగమే ఊయల
కడలి పిలువ కన్నేవాగు పరుగుతీసే
మురళిపాట విన్ననాగు శిరసునూపే
ఈ అనుబంధమే మధురానందమై
ఈ అనుబంధమే మధురానందమై
ఇలపై నందనాలు నిలిపిపోదా, ఆఆ ఆఆ
పగలే వెన్నెలా జగమే ఊయల
నీలి మబ్బు నీడలేచి… నెమలి ఆడే
పూలరుతువు సైగ చూచి… పికము పాడే
నీలి మబ్బు నీడలేచి… నెమలి ఆడే
పూలరుతువు సైగ చూచి… పికము పాడే
మనసే వీణగా ఝున ఝున మ్రోయగా
బ్రతుకే పున్నమిగా విరిసిపోదా, ఆఆ ఆ ఆ
పగలే వెన్నెలా జగమే ఊయల
కదలే వూహలకే కన్నులుంటే, ఏఏ ఏ ఏఏ ఏ
పగలే వెన్నెలా