ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Pachagaddi Koseti Lyrics in Telugu – Dasara Bullodu
పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్
నీ పైట కొంగు జారిందే గడుసు పిల్లా
పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్
నీ పైట కొంగు జారిందే గడుసు పిల్లా
కొంగు జారితేముంది కొంటె పిల్లోడా
నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా
అహా కొంగు జారితేముంది కొంటె పిల్లోడా
నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా
కొప్పులోన బంతిపూలు గునుస్తున్నవీ
చెప్పలేని వూసులేవో చెప్పుతున్నవీ
కొప్పులోన బంతిపూలు గునుస్తున్నవీ
చెప్పలేని వూసులేవో చెప్పుతున్నవీ
వూసులన్నీ వింటివా వూరుకోవవి
ఆశలై బాసలై అంటుకొంటవి
వూసులన్నీ వింటివా వూరుకోవవి
ఆశలై బాసలై అంటుకొంటవి
హెయ్ పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్
నీ పైట కొంగు జారిందే గడుసు పిల్లా
అహా కొంగు జారితేముంది కొంటె పిల్లోడా
నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా
వరిచేను కోతకొచ్చి వంగుతున్నది
వంపులన్నీ వయసొచ్చి పొంగుతున్నవి
వరిచేను కోతకొచ్చి వంగుతున్నది
వంపులన్నీ వయసొచ్చి పొంగుతున్నవి
వయసు తోటి మనసేమో పోరుతున్నది
వయసు తోటి మనసేమో పోరుతున్నది
వలపులోనె రెండిటి ఒద్దికున్నది
వలపులోనె రెండిటి ఒద్దికున్నది
హొయ్ పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్
నీ పైట కొంగు జారిందే గడుసు పిల్లా
అహా కొంగు జారితేముంది కొంటె పిల్లోడా
నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా
కొడవలితో లేత గడ్డి కోసుకొంటివి
కొంటె చూపుతో గుండె దూసుకొంటివి
కొడవలితో లేత గడ్డి కోసుకొంటివి
కొంటె చూపుతో గుండె దూసుకొంటివి
గడ్డి మోపు తలపైన మోసుకొస్తిని
గడుసువాడ్ని తలపుల్లో దాచుకొంటిని
గడ్డి మోపు తలపైన మోసుకొస్తిని
గడుసువాడ్ని తలపుల్లో దాచుకొంటిని
అహా పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్
నీ పైట కొంగు జారిందే గడుసు పిల్లా
ఆ కొంగు జారితేముంది కొంటె పిల్లోడా
నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా