Menu Close

Ooruko Naa Praanama Lyrics – ఊరుకో నా ప్రాణమా లిరిక్స్ – Telugu Christian Songs Lyrics


Ooruko Naa Praanama Lyrics – ఊరుకో నా ప్రాణమా లిరిక్స్ – Telugu Christian Songs Lyrics

ఊరుకో నా ప్రాణమా కలత చెందకు
ఆనుకో ప్రభు రొమ్మున నిశ్చింతగా
ఊరుకో నా ప్రాణమా… కలత చెందకు
ఆనుకో ప్రభు రొమ్మున నిశ్చింతగా

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం
ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి👇

Telegram WhatsApp

ఎడారి దారిలోన‌‌‌… కన్నీటి లోయలోన
నా పక్ష‌మందు నిలిచే నా ముందరే నడిచే
నీ శక్తినే చాట… నన్నుంచేనే ఈ చోట
నిన్నెరుగుటే మా ధనం
ఆరాధనే మా ఆయుధం

ఎర్రసముద్రాలు నా ముందు పొర్లుచున్న
ఫరో సైన్యమంతా నా వెనుక తరుముచున్న ||2||
నమ్మదగిన దేవుడే నడిపించుచుండగా
నడి మధ్యలో నన్ను విడిచిపెట్టునా ||2||

ఇంతవరకు నడిపించిన దాక్షిణ్యపూర్ణిడు
అన్యాయము చేయుట అసంభవమేగా ||2||
వాగ్దానమిచ్చిన సర్వశక్తిమంతుడా
దుష్కార్యము చేయుట అసంభవమేగా ||2||

అవరోధాలెన్నో నాచుట్టూ అలుముకున్న
అవరోధాల్లోనే అవకాశాలను దాచేగా ||2||
యెహోవా సెలవిచ్చిన… ఒక్కమాటయైనను
చరిత్రలో ఎన్నటికి తప్పియుండలేదుగా ||2||

ఊరుకో నా ప్రాణమా కలత చెందకు
ఆనుకో ప్రభు రొమ్మున నిశ్చింతగా
ఊరుకో నా ప్రాణమా… కలత చెందకు
ఆనుకో ప్రభు రొమ్మున నిశ్చింతగా.. ..

Ooruko Naa Praanama Lyrics – ఊరుకో నా ప్రాణమా లిరిక్స్ – Telugu Christian Songs Lyrics

Like and Share
+1
0
+1
0
+1
0
Share with your friends & family
Posted in Telugu Christian Songs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Loading poll ...

Subscribe for latest updates

Loading