ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ఒక్కపూట అన్నం కోసం… ఎదురు చూడడం
జానెడంత ఊపిరి కోసం… చెయ్యి చాచడం
కడుపు కాలి కాలి ఇక్కడ… బూడిద అవుతున్న
మనిషి అన్న వాడికి.. మనసే లేకపోయెనన్నా
ఉన్నవాడే కొంచం ఇస్తే… లేని వాడె ఉండడే
కళ్ళు తెరచి చూడు దేవుడా… అందరు నీ పిల్లలే.. ఏ ఏఏ
ఒక్కపూట అన్నం కోసం… ఎదురు చూడడం
జానెడంత ఊపిరి కోసం… చెయ్యి చాచడం
అన్ని ఉన్న ఏదో కోరి… చెయ్యి చాచి అడిగే లోకం
పుట్టిన ప్రతి వాడు… ఇక్కడ పెద్ద బిచ్చగాడేరా
పుట్టబోయే మనవడి కోసం… ఉన్నవాడు కూడబెడితే
గూడులేని వాడికి పాపం… దేవుడే మాత్రం దిక్కుర
నువ్వెతికే ఆ ఏదో ఒక్కటి… దొరకక పొగా నీకు
అవమానం ఎదురవ్వును ఇక్కడ… దినదినము ప్రతిదినము
ఏముందని ఇన్నాళ్లుగ నీకు… జీవించావురా నువ్వు
ఆ ధైర్యం నువ్వు వీడక ఉండరా… దేవుడే అండరా నీకు
ఆఆ ఆ ఆ ఆ… ఆ ఆఆ ఆఆ
ఒక్కపూట అన్నం కోసం… ఎదురు చూడడం
జానెడంత ఊపిరి కోసం… చెయ్యి చాచడం
కడుపు కాలి కాలి ఇక్కడ… బూడిద అవుతున్న
మనిషి అన్న వాడికి.. మనసే లేకపోయెనన్నా
ఉన్నవాడే కొంచం ఇస్తే… లేని వాడె ఉండడే
కళ్ళు తెరచి చూడు దేవుడా… అందరు నీ పిల్లలే.. ఏ ఏఏ