ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ఒక చిన్ని నవ్వే నవ్వి… యుధ్దాలెన్నో ఆపొచ్చూ
ఒక చిన్న నవ్వే నవ్వి… బంధాలెన్నో కలపొచ్చూ ||2||
చిరునవ్వుల దీపం వెలిగించూ… నీ బాధలకీగతి తొలగించూ
చిరునవ్వుల బాణం సంధించూ… శత్రువులే ఉండరు గమనించూ
మనిషన్నోడే మనసారా… తానే నవ్వొచ్చూ
మనసున్నోడే తనవారిని… కూడా నవ్వించూ
పైనున్నోడే నీ నవ్వును… చూసి దిగి వచ్చూ
నీతో పాటే తన కష్టం మరవచ్చూ…
ఒక చిన్ని నవ్వే నవ్వి… యుధ్దాలెన్నో ఆపొచ్చూ
ఒక చిన్న నవ్వే నవ్వి… బంధాలెన్నో కలపొచ్చూ
నీ గుండెల్లోనా గాయాలెన్నున్నా… పెదవుల్లో నవ్వే వాటికి మందూ
నీ కన్నుల్లోనా కన్నీరెంతున్నా… అదరాల నవ్వే వాటికి హద్దూ
త్వరగా నిను చూసి… నవ్వేవారు నిద్దుర పోయేట్టూ
సరిగా నీ నవ్వుని నిచ్చెన చేసి… ఎక్కర పై మెట్టూ
నీ కోపం నువ్వే కరిగించు… నీ రూపం నువ్వే వెలిగించూ
ఈ పాఠం నువ్వే పాటించు… పది మందికి నువ్వే చాటించూ
ఒక చిన్ని నవ్వే నవ్వి… యుధ్దాలెన్నో ఆపొచ్చూ
ఒక చిన్న నవ్వే నవ్వి… బంధాలెన్నో కలపొచ్చూ
ఏడ్చేవాళ్ళుంటే ఇంకా ఏడ్పించీ… కసితీరా నవ్విస్తుందీ లోకం
నవ్వే వాళ్లుంటే నవ్వులు నటియించి…కడుపారా ఏడుస్తుందీ కాలం
కనుకే లోకాన్నే ఎదిరించేటి… మార్గం కనిపెట్టు
కదిలే కాలాన్నే ఎదురీదేటి… ధైర్యం చూపెట్టూ
ఈ జీవిత సత్యం గుర్తించూ… ఆనందం నీవై జీవించూ
నీ చలనం నువ్వే గమనించూ… సంచలనం నువ్వే సృష్టించు
ఒక చిన్ని నవ్వే నవ్వి… యుధ్దాలెన్నో ఆపొచ్చూ
ఒక చిన్న నవ్వే నవ్వి… బంధాలెన్నో కలపొచ్చూ ||2||