Menu Close

O Pilla Nee Valla Song Lyrics In Telugu – Mugguru Monagallu


చూడకే చూసినాను చందమామనే పగటేల తారనే
మరి మాటరాని గుండెలోన కవితలాయెనే
నేలకే జారినాది పండు వెన్నెలే సరి పాలపుంతలే
ఇక మౌనమేమొ గంతులేసి కబురులాయనే

ప్రాణమే తన జాడని వెతుకులాడి మురిసెగా
ప్రాయమే తన తోడుని బతిమలాడేగా
గానమే తన చూపని చెవులలోన మొగిలాగా
గమ్యమే తన నీడని అడుగుసాగెగా

ఓ పిల్లా నీ వల్ల నేను వయసు వరసని
మరి కధలుకధలుగా మది తెలుపలేని తలపులని
కాగితములుగ రాసి మనసు తెలుపనీ
తదుపరి హాయి మనదనీ… జతలో నీ తోడే కననీ

చూడకే చూసినాను చందమామనే పగటేల తారనే
మరి మాటరాని గుండెలోన కవితలాయెనే

వినబడు పాటలే తమరివి కావనే
తెగ సరదాల పరాచకాలకే
తెగిబడి మాటలే తరమగ రావనే
నిజమనడాల తగాదలాడకే

లోకం ఇకపైన తనచూపులోనే
దాగిపోయే వైనం చిరకాలం మరిచేదెలా
పాపం ఉనికైనా మిగిలిందో లేదో
జాలి చూపమంటు భువి సైతం అడుగేయదా

ఓ పిల్లా నీ వల్ల నేను వయసు వరసని
మరి కధలుకధలుగా మది తెలుపలేని తలపులని
కాగితములుగ రాసి మనసు తెలుపనీ
తదుపరి హాయి మనదనీ… జతలో నీ తోడే కననీ

చూడకే చూసినాను చందమామనే పగటేల తారనే
మరి మాటరాని గుండెలోన కవితలాయెనే
నేలకే జారినాది పండు వెన్నెలే సరి పాలపుంతలే
ఇక మౌనమేమొ గంతులేసి కబురులాయనే

Like and Share
+1
0
+1
0
+1
0
Posted in Lyrics in Tamil - Movie Songs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading