Menu Close

O Manasa O Manasa Song Lyrics In Telugu

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

ఓ మనసా ఓ మనసా… చెబితే వినవా నువ్వు
నీ మమతే మాయ కదా… నిజమే కనవా నువ్వు
చెలియ గుండె తాకలేక… పలకనందే నా మౌనం
చెలిమి వెంట సాగలేక… శిల అయిందే నా ప్రాణం
గతమే మరిచి బ్రతకాలే మనసా..!!
ఓ మనసా ఓ మనసా… చెబితే వినవా నువ్వు
నీ మమతే మాయ కదా… నిజమే కనవా నువ్వు

ఎగసిపడే అల కోసం… దిగి వస్తుందా ఆకాశం
తపనపడి ఏం లాభం… అందని జాబిలి జత కోసం
కలిసి ఉన్న కొంతకాలం… వెనక జన్మ వరమనుకో
కలిసి రాని ప్రేమ తీరం… తీరిపోయిన రుణమనుకో
మిగిలే స్మృతులే వరమనుకో… మనసా మనసా
ఓ మనసా ఓ మనసా… చెబితే వినవా నువ్వు
నీ మమతే మాయ కదా… నిజమే కనవా నువ్వు

తన ఒడిలో పొదువుకుని… భద్రంగా నడిపే నౌక
తననొదిలి వెళ్ళకని… ఏ బంధాన్ని కోరదుగా
కడలిలోనే ఆగుతుందా… కదలనంటు ఏ పయనం
వెలుగువైపు చూడనందా… నిదరలేచే నా నయనం
కరిగే కలలే తరిమే ఓ మనసా మనసా
ఓ మనసా ఓ మనసా… చెబితే వినవా నువ్వు
నీ మమతే మాయ కదా… నిజమే కనవా నువ్వు

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading