Menu Close

Nuvvena Na Nuvvena Lyrics In Telugu-Anand

నువ్వేనా నా నువ్వేనా… నువ్వేనా నాకు నువ్వేనా
సూర్యుడల్లె సూది గుచ్చే సుప్రభాతమేనా
మాటలాడే చూపులన్ని మౌనరాగమేనా
చేరువైన దూరమైన ఆనందమేనా
చేరువైన దూరమైన ఆనందమేనా
ఆనందమేనా… ఆనందమేనా
నువ్వేనా నా నువ్వేనా… నువ్వేనా నాకు నువ్వేనా

మేఘమల్లె సాగి వచ్చి… దాహమేదో పెంచుతావు
నీరు గుండెలోన దాచి… మెరిసి మాయమౌతావు
కలలేనా కన్నీరేనా…!!!
ఆఆఆ..! తేనెటీగ లాగ కుట్టి… తీపి మంట రేపుతావు
పువ్వులాంటి గుండెలోన… దారమల్లె దాగుతావు
నేనేనా..! నీ రూపేనా

చేరువైన దూరమైన ఆనందమేనా
చేరువైన దూరమైన ఆనందమేనా
ఆనందమేనా… ఆనందమేనా
నువ్వేనా నా నువ్వేనా… నువ్వేనా నాకు నువ్వేనా

ఆ ఆఆ..! కోయిలల్లే వచ్చి ఏదో కొత్త పాట నేర్పుతావు
కొమ్మగొంతులోన గుండె… కొట్టుకుంటే నవ్వుతావు
ఏ రాగం ఇది ఏ తాళం
ఆ ఆ..! మసక ఎన్నెలల్లె నీవు… ఇసుక తిన్నె చేరుతావు
గసగసాల కౌగిలింత… గుసగుసల్లె మారుతావు
ప్రేమంటే నీ ప్రేమేనా

చేరువైన దూరమైన ఆనందమేనా
చేరువైన దూరమైన ఆనందమేనా
ఆనందమేనా… ఆనందమేనా
నువ్వేనా నా నువ్వేనా… నువ్వేనా నాకు నువ్వేనా

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading