ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
నువ్వే నువ్వే అంతా నువ్వే… నా కోసం నువ్వున్నావే
పంచివ్వు నీ చిరునవ్వే… కన్నుల్లో వానాకాలం కానన్నావే
ఎండల్లో శీతాకాలం నువ్వే…
ఓఓ… నువ్వే నువ్వే అంతా నువ్వే… నా కోసం నువ్వున్నావే
పంచివ్వు నీ చిరునవ్వే… కన్నుల్లో వానాకాలం కానన్నావే
ఎండల్లో శీతాకాలం నువ్వే
నా గుమ్మం ముందు వాసంతం
నా గుమ్మం ముందు వాసంతం… ఉంచినది నువ్వే
ఆ నింగిని కూడా నా కోసం… దించినది నువ్వే
నా ఎదలో లాలి పదమై వాలి… వెన్నెల్లు చల్లు చందమామవే
నువ్వే నువ్వే అంతా నువ్వే… నా కోసం నువ్వున్నావే
పంచివ్వు నీ చిరునవ్వే… కన్నుల్లో వానాకాలం కానన్నావే
ఎండల్లో శీతాకాలం నువ్వే
కంటికి నిదురే రాకుంది… కలలకు సైతం దారేదీ
గాలులు మోసే గానంలో… గుండెకు నిన్నటి బరువే దీ
కంటికి నిదురే రాకుంది… కలలకు సైతం దారేదీ
గాలులు మోసే గానంలో… గుండెకు నిన్నటి బరువేదీ
కురిసిన మంచువిలే… నువ్వు నెమలికి ఫించమువే
స్వరముల నెచ్చెలివే… నీ తలపులు వెచ్చనివే
ముసిరిన ఈ మౌనం… అది కరిగినదే వైనం
సుఖముల శృతిలయలో… మది నిండెను నీ గానం
ఓ ఓ… నువ్వే నువ్వే అంతా నువ్వే… నా కోసం నువ్వున్నావే
పంచివ్వు నీ చిరునవ్వే… కన్నుల్లో వానాకాలం కానన్నావే
ఎండల్లో శీతాకాలం నువ్వే
నిన్నే చూడను పొమ్మంటు.. నే కన్నులు మూసి కూర్చున్నా
ఎప్పుడు చప్పున వచ్చావో… రెప్పల చాటున నిను కన్నా
కమ్మని కథలెన్నో… కొలువుంచా కలబోసి
కనిపించని వలవేసి నను లాగకు దయచేసి
సొగసుల అల్లికతో… మది గెలిచిన మల్లికవే
కసి చూపుల కత్తులతో… నా వయసును గిల్లితివే
ఓఓ… నువ్వే నువ్వే అంతా నువ్వే… నా కోసం నువ్వున్నావే
పంచివ్వు నీ చిరునవ్వే… కన్నుల్లో వానాకాలం కానన్నావే
ఎండల్లో శీతాకాలం నువ్వే…
నా గుమ్మం ముందు వాసంతం… ఉంచినది నువ్వే
ఆ నింగిని కూడా… నా కోసం దించినది నువ్వే
నా ఎదలో లాలి పదమై వాలి… వెన్నల్లు చల్లు చందమామవే