ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
నువ్వంటూ లేక… నే లేనే అమ్మ
నీ రక్తమే పంచి… ఇచ్చావే జన్మ
నా నుదుటి పైన తొలి ముద్దు నువ్వే
తొలిముద్ద నువ్వై నా కడుపు నింపావే
మనసంతా పూసేటి… ఓ హాయి నువ్వమ్మ
కన్నీరే తుడిచేటి… ఆ చేయి నీదమ్మ
పంచిస్తే పెరిగేటి ప్రేమంటే నువ్వమ్మా
నీ ఊపిరే నాలో ప్రాణంలా ఉందమ్మా
నా నిదురకే నువ్వూయలయ్యావు
నాకోసమే కలలెన్నో కన్నావు
ఓ కంచెలా నా కాపలున్నావు
నీ కొంగులో దాచి లోకాన్ని చూపావు
ఆరారో ఆరారిరాయే ఆరారో
ఆరారో ఆరారిరాయే ఆరారో
ఆరారిరాయో అరరాహి అరరాహి
అరరాహి రాయే
అరరాహి అరరాహి అరరాహి రాయే
ఆఆ ఆఆ ఆ ఆఆ ఆఆ ఆ ఆఆ ఆఆ ఆ
నా కళ్ళల్లోనా… వెలుగుల్ని నింపి
చీకట్లో ఈరోజు… మిగిలావే అమ్మ
నను కన్న తల్లి నా ఆయువిచ్చి
నిన్నే నిన్నే బ్రతికించుకుంటానే
Like and Share
+1
+1
+1