అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
North Korea Floods: పని పట్ల నిర్లక్ష్యంగా ఉన్నందుకు 30 మందికి ఉరి: ఇలా చేస్తే కానీ ఉద్యోగులు, అదికారులు బాద్యతగా పని చెయ్యరు. మనం చూస్తూనే వుంటాం మన దేశంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎంత నిర్లక్ష్యంగా పని చేస్తుంటారో. హా మనకేంటి, మనల్ని ఎవరు అడిగేది అనే దోరనిలోకి ఎప్పుడో వచ్చేశారు. ఇటువంటి వారితో కఠినంగా వుంటే సరిపోదు. ఇలాంటి క్రూరమైన శిక్షలు వేస్తే కానీ దారిలోకి రారు.

అలాంటిదే ఉత్తర కొరియాలో జరిగింది.
వరదలు, కొండచరియలు విరిగిపడిన టైంలో సరిగా పనిచేయలేదని ఉత్తర కొరియా ప్రెసిడెంట్ కిమ్ జోంగ్ ఉన్ 30 మంది ప్రభుత్వ అధికారులను ఉరి తీయించారు. కొండచరియలు విరిగిపడిన సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, వరదలను కంట్రోల్ చేయడంలో ఫెయిల్ అయ్యారని, అందుకే కిమ్ కఠిన చర్యలు తీసుకున్నారని దక్షిణ కొరియాకు చెందిన చోసన్ టీవీ రిపోర్టులో వెల్లడించింది.

గత జులైలో తీవ్ర వర్షాల కారణంగా ఉత్తరకొరియాలో వరదలు సంభవించాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ విపత్తు సమయంలో దేశవ్యాప్తంగా 1,000 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
4 వేల ఇండ్లు నేలమట్టమయ్యాయి. 15 వేల మంది నిరాశ్రయులయ్యారు. ఆ సమయంలో కిమ్ స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.
నడుము లోతు నీళ్లలో కారులో వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షించారు. సిబ్బంది సహాయక చర్యలపై అప్పుడే ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం, ఇంతమంది ప్రాణాలు పోవడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమనే అభియోగాలు మోపి 30 మందికి కిమ్ ఉరిశిక్ష విధించారని చోసన్ టీవీ తెలిపింది. ఆగస్ట్ నెలాఖరున ఒకే సమయంలో వారందరినీ ఉరితీశారని చెప్పింది. అయితే, ఆ ఆఫీసర్ల పేర్లు మాత్రం వెల్లడించలేదు.
North Korea allegedly executes 30 government officials for flood failures.
North Korea executes around 30 govt officials after deadly floods and landslides
Kim Jong Un Executes 30 Officials For Failing To Prevent Deaths During Floods
North Korea’s Kim Jong Un executes 30 govt officials for ‘unacceptable deaths’ after floods