ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
నిన్ను తలచి మైమరచా… చిత్రమే అది చిత్రమే
నన్ను తలచి నవ్వుకున్నా… చిత్రమే అది చిత్రమే
నిన్ను తలచి మైమరచా… చిత్రమే అది చిత్రమే
నన్ను తలచి నవ్వుకున్నా… చిత్రమే అది చిత్రమే
ఆ నింగినెన్నటికీ… ఈ భూమి చేరదనీ
నాడు తెలియదులే… ఈనాడు తెలిసెనులే, ఓ చెలీ..!
నిన్ను తలచి మైమరచా… చిత్రమే అది చిత్రమే
నన్ను తలచి నవ్వుకున్నా… చిత్రమే అది చిత్రమే
ఆడుకుంది నాతో జాలిలేని దైవం
పొందలేక నిన్నూ ఓడిపోయే జీవితం
జోరువానలోనా ఉప్పునైతి నేనే
హొరుగాలిలోనా ఊకనైతి నేనే
గాలి మేడలే కట్టుకున్నా… చిత్రమే అది చిత్రమే
సత్యమేదో తెలుసుకున్నా… చిత్రమే అది చిత్రమే
కథ ముగిసెను కాదా… కల చెదిరెను కాదా, అంతే..!
నిన్ను తలచి మైమరచా… చిత్రమే అది చిత్రమే
నన్ను తలచి నవ్వుకున్నా… చిత్రమే అది చిత్రమే
కళ్ళలోన నేను కట్టుకున్న కోట
నేడు కూలిపోయే ఆశ తీరు పూట
కోరుకున్న యోగం జారుకుంది నేడు
చీకటేమో నాలో చేరుకుంది చూడు
రాసి ఉన్న తలరాత తప్పదు… చిత్రమే అది చిత్రమే
గుండె కోతలే నాకు ఇప్పుడు… చిత్రమే అది చిత్రమే
కథ ముగిసెను కాదా కల చెదిరెను కాదా, అంతే
నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే
నన్ను తలచి నవ్వుకున్నా చిత్రమే అది చిత్రమే
ఆ నింగినెన్నటికీ ఈ భూమి చేరదనీ
నాడు తెలియదులే ఈనాడు తెలిసెనులే, ఓ చెలీ
నిన్ను తలచి మైమరచా… చిత్రమే అది చిత్రమే
నన్ను తలచి నవ్వుకున్నా… చిత్రమే అది చిత్రమే