Menu Close

Jallantha Kavvinta Song Lyrics In Telugu – Geethanjali

జల్లంత కవ్వింత కావాలిలే
ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
జల్లంత కవ్వింత కావాలిలే
ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే

ఉరుకులు పరుగులు
ఉడుకు వయసు దుడుకుతనము నిలువదు
తొలకరి మెరుపులా… ఉలికిపడిన కలికి సొగసు
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే
ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే
ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే

వాగులు వంకలు గలగల చిలిపిగా పిలిచినా
గాలులు వానలు చిటపట చినుకులే చిలికినా
మనసు ఆగదు ఇదేమి అల్లరో
తనువు దాగదు అదేమి తాకిడో
కోనచాటు బొండుమల్లె తేనేనొక్క ముద్దులాడి
వెళ్ళదాయె కళ్ళు లేని దేవుడెందుకో మరి
|| జల్లంత కవ్వింత – వెన్నెల్లు తెచ్చిందిలే ||

సందులో రంగులే… నొసటిపై తిలకమే నిలపగా
తెలిపెనే మంచులే… తెలియని తపనలే తెలుపగా
వాన దేవుడే కళ్ళాపి జల్లగా… వాయు దేవుడే ముగ్గేసి వెళ్ళగా
నీలికొండ గుండెలోని ఊసులన్ని తెలుసుకున్న
కొత్త పాట పుట్టుకొచ్చె ఎవరి కోసమో, ఓహో

జల్లంత కవ్వింత కావాలిలే
ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
జల్లంత కవ్వింత కావాలిలే
ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
ఉరుకులు పరుగులు
ఉడుకు వయసు దుడుకుతనము నిలువదు
తొలకరి మెరుపులా… ఉలికిపడిన కలికి సొగసు
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే
ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే
ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading

Top 5 Life Quotes in Telugu Most Inspiring Telugu Quotes Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images