ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Nenani Neevani Song Lyrics In Telugu – Kotha Bangaru lokam – నేననీ నీవనీ వేరుగా లేమనీ లిరిక్స్
నేననీ నీవనీ వేరుగా లేమనీ
చెప్పినా వినరా, ఒకరైనా… ఆఆ ఆ
నేను నీ నీడనీ.. నువ్వు నా నిజమనీ
ఒప్పుకోగలరా ఎపుడైనా
రెప్ప వెనకాల స్వప్నం
ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే
అడ్డుకోగలదా వేగం
కొత్త బంగారు లోకం పిలిస్తే
మొదటి సారి మదిని చేరి… నిదర లేపిన ఉదయమా
వయసులోని పసితనాన్ని… పలకరించిన ప్రణయమా
మరీ కొత్తగా మరో పుట్టుక… అనేటట్టుగా ఇది నీ మాయేనా
పదము నాది పరుగు నీది
రథము వెయ్ రా ప్రియతమా
తగువు నాది తెగువ నీది
గెలుచుకో పురుషోత్తమా
నువ్వే దారిగా నేనే చేరగా
ఎటూ చూడకా… వెనువెంటే రానా
నేననీ నీవనీ వేరుగా లేమనీ
చెప్పినా వినరా, ఒకరైనా… ఆఆ ఆ
నేను నీ నీడనీ… నువ్వు నా నిజమనీ
ఒప్పుకోగలరా ఎపుడైనా
రెప్ప వెనకాల స్వప్నం
ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే
అడ్డుకోగలదా వేగం
కొత్త బంగారు లోకం పిలిస్తే.. ..
Nenani Neevani Song Lyrics In Telugu – Kotha Bangaru lokam – నేననీ నీవనీ వేరుగా లేమనీ లిరిక్స్