నీదీ నాదంటూ… నిలువు గీత దాటి
నిలవాలి నీలోన… విశ్వనరుని రీతి
నీదీ నాదంటూ… నిలువు గీత దాటి
నిలవాలి నీలోన… విశ్వనరుని రీతి
తలుపులే కరిగి ఈ వేళ
మొలకలే వెలికి రావాల
కలతలే చెదిరి పోయేలా
మమతలే బతుకు నిండేలా
ఓఓ ఓఓ, చిగురువని కచేరి చేసి
వచ్చింది చూడు దర్జాగా సర్కారే
ఓఓ ఓఓ, చమటతడి చల్లారిపోగా
చల్లంగా వీచే మెల్లంగా నీపై నేలే
తోడబుట్టని తోడు నీవురా
ప్రేమ పంచిన కధ నీది
చమ్మ చేరని గుండె గూటికి
కరుణ తెచ్చిన కధ నీది
రాత రాసిన బ్రహ్మరాతని
మార్చివేసిన కధ నీది
దారితప్పిన చంటి బిడ్డకి
అమ్మ చెప్పిన కధ నీది ||2||
నీది నాదంటూ… నిలువు గీత దాటి
నిలవాలి నీలోన… విశ్వనరుని రీతి
నీపై గెలవాలని… చేరా నిశిని
నీకే తెలియాలని… దాచా నుసిని
ఉంటానని తోడుగా… మాటే నిలిచి
నీకే కనుపాపలా… కాపే అవని
విసిరితే పాశమేదైనా
వెతికితే వెలకు దొరికేనా
తడబడే అడుగు నీదైనా
నిలబడే వరకు నేనున్నా
ఓఓ ఓ ఓ, ప్రతి ఒకడి పునాదిలోన
ఉన్నాడు లేరా చెడ్డోడు మంచోడు
ఓఓ ఓ ఓ, తెలుసుకోని మన్నించి చూడు
నీ అంతటోడు ఇంకెవ్వడుంటాడు
తోడబుట్టని తోడు నీవురా
ప్రేమ పంచిన కధ నీది
చమ్మ చేరని గుండె గూటికి
కరుణ తెచ్చిన కధ నీది
రాత రాసిన బ్రహ్మరాతని
మార్చివేసిన కధ నీది
దారితప్పిన చంటి బిడ్డకి
అమ్మ చెప్పిన కధ నీది
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.