ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
నీ వెంటే నేనుంటే… బాగుందే చాలా
నీ నీడకు పేరుంటే… నాదయ్యేలా
నీతో అడుగేస్తుంటే… బాగుందే చాలా
నేనెందుకు పుట్టానో… తెలిసొచ్చేలా
ఓ ఓ ఓఓ… నీకోసం ఏం చేస్తున్న
ఓ ఓ ఓఓ… నాకే నే నచ్చేస్తున్న
ఓ ఓ ఓఓ… ప్రాణాలే పంచివ్వాలా
ఓ ఓ ఓఓ… నువ్వడగడమే ఆలస్యమనేలా
నీ వెంటే నేనుంటే… బాగుందే చాలా
నీ నీడకు పేరుంటే… నాదయ్యేలా
నీతో అడుగేస్తుంటే… బాగుందే చాలా
నేనెందుకు పుట్టానో… తెలిసొచ్చేలా
నువ్వే ఒక పుస్తకమైతే… నెమలీకై నీతో ఉంటా
నువ్వే ఒక కిటికీవైతే… వెలుతురులా నిన్ను చూస్తుంటా
నా చిరునామా ఏదంటే… నీ చిరునవ్వేనని చెబుతా
నా గమ్యం ఎక్కడ అంటే… నీ పయణాన్నే చూపిస్తా
ఓ ఓ ఓఓ… నీ కలలే నిజమయ్యేలా
ఓ ఓ ఓఓ… నువ్వు కలగనడం ఆలస్యమనేలా
నీ వెంటే నేనుంటే… బాగుందే చాలా
నీ నీడకు పేరుంటే… నాదయ్యేలా
నీతో అడుగేస్తుంటే… బాగుందే చాలా
నేనెందుకు పుట్టానో… తెలిసొచ్చేలా
నా రాజకుమారుడు నువ్వు… నా రంగుల లోకం నువ్వు
నిజమల్లే వచ్చేసావు… హృదయాన్నే పంచేసావు
నీ కన్నుల కలలే తీసి… నా కంటికి కాటుక చేసి
నా మనసుకి ప్రాణం పోసి… వెన్నెలతో నింపేసావు
ఓ ఓ ఓఓ… అద్దంలా నను దిద్దావు
ఓ ఓ ఓఓ… నా పెదవుల్లో తొలి ముద్దయ్యావు
నీ వెంటే నేనుంటే… బాగుందే చాలా
నీ నీడకు పేరుంటే… నాదయ్యేలా
నీతో అడుగేస్తుంటే… బాగుందే చాలా
నేనెందుకు పుట్టానో… తెలిసొచ్చేలా