ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Nee Bantu Nenayya Song Lyrics In Telugu
ఓ బొజ్జ గణపయ్య… నీ బంటు నేనయ్య
ఉండ్రాళ్ళమీదికి దండు పంపు
కమ్మని నేయితో కడు ముద్దపప్పును
బొజ్జ విరుగగ దినుచు పొరలుకొనుచు
జయ మంగళం నిత్య శుభ మంగళం
జయ మంగళం నిత్య శుభ మంగళం
శ్రీ శంభు తనయునకు… సిద్ధి గణనాధునకు
వాసిగల దేవతావంద్యునకును
ఆ సరస విద్యలకు ఆది గురువైనట్టి
భూసురోత్తమ లోకపూజ్యునకును
జయ మంగళం నిత్య శుభ మంగళం
జయ మంగళం నిత్య శుభ మంగళం
నేరేడు మారేడు నెలవంక మామిడి
దూర్వార చెంగల్వ ఉత్తరేణి
వేరువేరుగా తెచ్చి వేడ్కతో పూజింతు
సర్వమున దేవగణపతికి నిపుడు
జయ మంగళం నిత్య శుభ మంగళం
జయ మంగళం నిత్య శుభ మంగళం
పానకము వడపప్పు పనసమామిడి పండ్లు
దానిమ్మ, ఖర్జూర, ద్రాక్షపండ్లు
తేనెతో మాగిన తీయ మామిడిపండ్లు
అర్పింతుమును అగ్రపూజ్యనకును
జయ మంగళం నిత్య శుభ మంగళం
జయ మంగళం నిత్య శుభ మంగళం
మల్లెలూ మందారు మంచి సంపెంగలు
చల్లనైన గంధ సారములను మనసార మైమరచి
పూజలే చేసేము పార్వతీ తనయునికి గణపతికినిపుడు
జయ మంగళం నిత్య శుభ మంగళం
జయ మంగళం నిత్య శుభ మంగళం
Nee Bantu Nenayya Song Lyrics In English
O Bojja Ganapayya… Nee Bantu Nenayya
Undraalla Meediki Dandu Pampu
Kammani Neyyitho Kadu Muddhapappunu
Bojja Virugaga Dhinuchu Poralukonuchu
Jaya Mangala Nithya Shubha Mangalam
Jaya Mangala Nithya Shubha Mangalam
Shree Shambu Thanayunaku… Siddhi Gananaadhunaku
Vaasigala Devathaavandhyunakunu
Aa Sarasa Vidhyalaku Aadhi Guruvainatti
Bhoosurotthama Lokapoojyunakunu
Jaya Mangala Nithya Shubha Mangalam
Jaya Mangala Nithya Shubha Mangalam
Neredu Maaredu Nelavanka Maamidi
Dhoorwaara Chengalwa Utthareni
Veruverugaa Thechhi Vedkatho Poojinthu
Sarwamuna Devaganapathiki Nipudu
Jaya Mangala Nithya Shubha Mangalam
Jaya Mangala Nithya Shubha Mangalam
Paanakamu Vadapappu Panasamaamidi Pandlu
Dhaanimma, Kharjoora, Dhraaksha Pandlu
Thenetho Maagina Theeya Maamidipandlu
Arpinthumunu Agrapoojyanakunu
Jaya Mangala Nithya Shubha Mangalam
Jaya Mangala Nithya Shubha Mangalam
Mallelu Madhaaru Manchi Sampengalu
Challanaina Gandha Saaramulanu Manasaara Maimarachi
Poojale Chesemu Parvathi Thanayuniki Ganapathikinipudu