ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Nayi Doro Naa Sinni Dora Lyrics in Telugu – Folk Song
నాయి దొరో నా … సిన్ని దొర రాజన్న
నాయి దొరో నా సిన్ని దొర రాజన్న
నాయి దొరో నా సిన్ని దొర రాజన్న
సిలకల మొఖం సినబాయెరో రాజన్న
హంసల మొఖం వాడి పాయెరో రాజన్న
నాయి దొరో నా సిన్ని దొర రాజన్న
నాయి దొరో నా సిన్ని దొర రాజన్న
సిలకల మొఖం సినబాయెరో రాజన్న
హంసల మొఖం వాడి పాయెరో రాజన్న
ఆ, ఇంటి ముందు బాయి తోడు రాజిరెడ్డి
ఇంటి ముందు బాయి తోడు రాజిరెడ్డి
నిన్నూ జూడ నీళ్లకొస్తనోయి రాజి రెడ్డి
నిన్నూ జూడ నీళ్లకొస్తనోయి రాజి రెడ్డి
బాయి మీద గిరక పెట్టు రాజిరెడ్డి
బాయి మీద గిరక పెట్టు రాజిరెడ్డి
మోట కొడితే నీళ్లు పడతనోయి రాజిరెడ్డి
మోట కొడితే నీళ్లు పడతనోయి రాజిరెడ్డి
నాయి దొరో నా సిన్ని దొర రాజన్న
నాయి దొరో నా సిన్ని దొర రాజన్న
సిలకల మొఖం సినబాయెరో రాజన్న
హంసల మొఖం వాడి పాయెరో రాజన్న
బాయి మీద పత్తి పెట్టు రాజిరెడ్డి
బాయి మీద పత్తి పెట్టు రాజిరెడ్డి
పత్తీ ఏరా నేనొస్తనోయి రాజిరెడ్డి
పత్తీ ఏరా నేనొస్తనోయి రాజిరెడ్డి
పత్తి బాకీ దేరకుంటె రాజిరెడ్డి
పత్తి బాకీ దేరకుంటె రాజిరెడ్డి
పట్టాగొలుసులమ్మి కడ్తనోయి రాజిరెడ్డి
పట్టాగొలుసులమ్మి కడ్తనోయి రాజిరెడ్డి
నాయి దొరో నా సిన్ని దొర రాజన్న
నాయి దొరో నా సిన్ని దొర రాజన్న
సిలకల మొఖం సినబాయెరో రాజన్న
హంసల మొఖం వాడి పాయెరో రాజన్న
కట్టా కింద కంది వెట్టు రాజిరెడ్డి
కట్టా కిందా కంది వెట్టు రాజిరెడ్డి
కందీ గొయ్య నేనొస్తనోయి రాజిరెడ్డి
కందీ గొయ్య నేనొస్తనోయి రాజిరెడ్డి
కందీ బాకీ దేరకుంటె రాజిరెడ్డి
కందీ బాకీ దేరకుంటె రాజిరెడ్డి
కమ్మాలమ్మి నేను కడ్తనోయి రాజిరెడ్డి
కమ్మాలమ్మి నేను కడ్తనోయి రాజిరెడ్డి
నాయి దొరో నా సిన్ని దొర రాజన్న
నాయి దొరో నా సిన్ని దొర రాజన్న
సిలకల మొఖం సినబాయెరో రాజన్న
హంసల మొఖం వాడి పాయెరో రాజన్న
మనసులోనా మనసు లేదు రాజిరెడ్డి
మనసులోనా మనసు లేదు రాజిరెడ్డి
మనసంతా నీమీదరో రాజిరెడ్డి
మనసంతా నీమీదరో రాజిరెడ్డి
మనసుతోనే మనువాడు రాజిరెడ్డి
మనసుతోనే మనువాడు రాజిరెడ్డి
నన్నల్లుకోని ఏలుకోవా రాజిరెడ్డి
నన్నల్లుకోని ఏలుకోవా రాజిరెడ్డి
నన్నల్లుకోని ఏలుకోవా రాజిరెడ్డి
నన్నల్లుకోని ఏలుకోవా రాజిరెడ్డి