అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
National Technology Day Story in Telugu – National Technology Day Telugu Quotes
ఎడ్లబండి నుండి విమానం వరకు, ఉత్తరాల నుండి వీడియొ కాల్ వరకు మనుషుల మద్య దూరాన్ని తగ్గించింది కచ్చితంగా టెక్నాలజి అనడంలోన్ అతిశయోక్తి లేదు, కానీ ఈ టెక్నాలజిని మంచి విషియాలకి వాడకుండా చెడు వాటికి వాడితే అది కచ్చితంగా బాధాకరం. దేశ ప్రజలు ఈ టెక్నాలజి లో మరింత వృద్ధి చెందాలని, ఎన్నో సమస్యలను పరిష్కరించాలని కోరుకుందాం ..

మనదేశంలో శాస్త్రవేత్తలు సాధించిన విజయాలకు గుర్తుగా ప్రతి యేటా టెక్నాలజీ డేను జరుపుతున్నారు. ఈరోజు గురించి ఐదు ఆసక్తికరమైన విషయాలు ఇవే!
ఈ టెక్నాలజీ డే గురించి మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే!
జాతీయ టెక్నాలజీ డేగా మే 11వ తేదీని మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయ్ ప్రకటించారు.
మే 11వ తేదీన మనదేశం పోఖ్రాన్ లో విజయవంతంగా అణుపరీక్షను నిర్వహించింది. 1998లో మే 11వ తేదీన భారత దేశంలో శక్తి-1 అణుక్షిపణిని రాజస్తాన్ లోని పోఖ్రాన్ ఆర్మీ టెస్ట్ రేంజ్ లో మన శాస్త్రవేత్తలు పరీక్షించారు. రెండు రోజుల తర్వాత మరో రెండు పరీక్షలు చేసి అణుశక్తి గల దేశాల్లో మనదేశాన్ని కూడా చేర్చారు.
ఇదే రోజున హంస-3ని కూడా శాస్త్రవేత్తలు రూపొందించారు. నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్(ఎన్ఏఎల్), కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎస్ఐఆర్)లు సంయుక్తంగా దీన్ని రూపొందించాయి.
1988 సంవత్సరంలో మే 11వ తేదీన డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్‌డీవో) త్రిశూల్ మిసైల్ చివరి పరీక్షను పూర్తి చేసింది.
1999 నుంచి ప్రతీ యేటా ఈరోజున(మే 11వ తేదీ) టెక్నాలజీ డెవలప్ మెంట్ బోర్డు(టీడీబీ) జాతీయ టెక్నాలజీ డేగా జరుపుతుంది. మనదేశానికి సాంకేతిక పరమైన సేవలందించిన శాస్త్రవేత్తలకు అవార్డులను కూడా అందిస్తారు.