ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Natanam Aadene Song Lyrics in Telugu
పల్లవి:
నటనం ఆడెనే ||2||
భవ తిమిరహంశుడా పరమ శివుడు
నటకావతంశుడై తక ధిమి తక యని
నటనం ఆడెనే
చరణం 1:
ఎనిమిది దిక్కులు ఒక్కటైనటుల
ఎండ వెన్నెలై వెల్లువైనటుల ||2||
నిటాలాక్షుడే తుషారాద్రి విడి
విశాలాక్షితో తాళ లయగతుల
నటనం ఆడెనే
చరణం 2:
శివగంగ శివమెత్తి పొంగగా
నెలవంక సిగపూవు నవ్వగా ||2||
హరిహరాత్మకం అగుచూ అఖిల ప్రపంచమ్ము
గరుడనాదానంద కావ్యమై వరలగా
నటనం ఆడెనే ఆడెనే
చరణం 3:
వసుధ వసంతాలాలపించగా
సురలు సుధను ధరలో కురిపించగా
రతీ మన్మధులు కుమార సంభవ
శుభోదయానికి నాంది పలుకగా
నటనం ఆడెనే,
భవ తిమిర హంశుడా పరమశివుడు
నటకావతంశుడై తక ధిమి తక యని
నటనం ఆడెనే,
భవ తిమిర హంశుడీ పరమశివుడు
నటకావతంశుడై తక ధిమి తకయని
నటనం ఆడెనే
Natanam Aadene Song Lyrics in Telugu