Menu Close

Nanu Preminchananu Mata Song Lyrics In Telugu – Jodi

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Nanu Preminchananu Mata Song Lyrics In Telugu – Jodi

నను ప్రేమించానను మాట… కలనైనా చెప్పెయ్ నేస్తం
కలకాలం బ్రతికేస్తా…
నను ప్రేమించానను మాట… కలనైనా చెప్పెయ్ నేస్తం
కలకాలం బ్రతికేస్తా…

పూవుల యదలో శబ్దం… మన మనసులు చేసే యుద్ధం
ఇక ఓపదె నా హృదయం… ఓపదే నా హృదయం
సత్యమసత్యము పక్కపక్కనే…. ఉంటయ్ పక్కపక్కనే
చూపుకి రెండు ఒక్కటే…
బొమ్మాబొరుసులు పక్కపక్కనే… చూసే కళ్లు ఒక్కటే
అయినా రెండూ వేరేలే…
నను ప్రేమించానను మాట… కలనైనా చెప్పెయ్ నేస్తం
కలకాలం బ్రతికేస్తా…

రేయిని మలిచి… ఈ ఈ ఆ ఆ…
రేయిని మలిచి… కనుపాపలుగా చేసావో…
కనుపాపలుగా చేసావో…
చిలిపి వెన్నెలతో కన్నులు చేశావో… ఓ ఓ

మెరిసే చుక్కల్ని తెచ్చి… వేలి గోళ్లుగ మలిచి
మెరుపుల తీగను తెచ్చి… పాపిటగా మలిచావో
వేసవిగాలులు పీల్చి… వికసించే పువ్వులు తెచ్చి
మంచి గంధాలెన్నో పూసి… మేను మలిచావో

అయినా మగువ… మనసుని శిలగా చేసినావే
వలచే మగువ… మనసుని శిలగా చేసినావే
నను ప్రేమించానను మాట… కలనైనా చెప్పెయ్ నేస్తం
కలకాలం బ్రతికేస్తా…

వయసుని తడిమి నిదురలేపింది నీవేగా… నిదురలేపింది నీవేగా
వలపు మధురిమలు తెలిపింది నీవేగా…
ఓఓ… గాలి నేల నింగి… ప్రేమ ప్రేమించే మనసు
వివరము తెలిపినదెవరు… ఓ ప్రేమ నీవేగా

గంగై పొంగె మనసు… కవితల్ని పాడుతు ఉంటే
తుంటరి జలపాతంలా… కమ్ముకున్నది నీవేగా
అయినా ప్రియుడా… మనసుకి మాత్రం దూరమైనావే
కరుణే లేక… మనసుని మాత్రం వీడిపోయావే

నను ప్రేమించానను మాట… కలనైనా చెప్పెయ్ నేస్తం
కలకాలం బ్రతికేస్తా…
నను ప్రేమించానను మాట… కలనైనా చెప్పెయ్ నేస్తం
కలకాలం బ్రతికేస్తా…
పూవుల యదలో శబ్దం… మన మనసులు చేసే యుద్ధం
ఇక ఓపదు నా హృదయం… ఓపదు నా హృదయం

Like and Share
+1
1
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading