ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
చెలిమను పరిమళం… మనిషికి తొలివరం
బ్రతుకున అతిశయం… వలపను చినుకులే
ఇరువురి పరిచయం… తెలియని పరవశం
తొలి తొలి అనుభవం… పరువపు పరుగులే
నన్నే నన్నే చూస్తూ… నా గుండెల్లో గుచ్చేస్తూ
నువ్వేదో ఏదో ఏదో చెయ్యొద్ధే..!
సోకుల గాలం వేస్తూ… నీ మాటల్లో ముంచేస్తూ
ఓ యమ్మో అమ్మో… ప్రాణం తియ్యొద్ధే
నీకో నిజమే చెప్పన్నా… నీకో నిజమే చెప్పన్నా
నా మదిలో మాటే చెప్పనా… యదలో ఏదో తుంటరి థిల్లానా
నాలో ఏదో అల్లరి… అది నిన్నా మొన్నాలేనిదీ
మరి ప్రేమో ఏమో ఒకటే హైరానా
హ్హ..! ఒహు వహా… ఒహు వహా.. ఏమిటంటారు ఈ మాయని
ఒహు వహా… ఒహు వహా… ఎవరినడగాలో ప్రేమేనా అనీ
నన్నే నన్నే చూస్తూ… నా గుండెల్లో గుచ్చేస్తూ
నువ్వేదో ఏదో ఏదో చెయ్యొద్ధే..!
సోకుల గాలం వేస్తూ… నీ మాటల్లో ముంచేస్తూ
ఓ యమ్మో అమ్మో… ప్రాణం తియ్యొద్ధే
ఇదివరకెరగని స్వరములు పలికెను
పగడపు జిలుగుల పెదాల వీణా
బిడియములేరగని గడసరి సొగసుకు
తమకములెగసెను నరాలలోనా హా లోనా
ఏమైందో ఏమిటో ప్రేమైందో ఏమిటో
నా వాటం మొత్తం ఏంటో మారింది
ఈ మైకం ఏమిటో… ఈ తాపం ఏమిటో!
నా ప్రాయం మాత్రం నిన్నే కోరింది
ఒహు వో ఓ హువా ఒహువా
నన్నే నన్నే మార్చి… నీ మాటలతో ఏమార్చి
ప్రేమించే ధైర్యం నాలో పెంచావోయ్
కన్ను కన్ను చేర్చి… నా కల్లోకే నువ్వొచ్చి
ఏకంగా బరిలోకే దించావోయ్
చెలిమను పరిమళం మనసుకి తొలివరం
బ్రతుకున అతిశయం వలపను చినుకులే
ఇరువురి పరిచయం తెలియని పరవశం
తొలి తొలి అనుభవం పరువపు పరుగులే
మనసున అలజడి వలపని తెలిపిన
జిలిబిలి పలుకుల చలాకీ మైనా
కళలను నిజముగా ఎదురుగ నిలిపిన
వరముగా దొరికిన వయ్యారి జానా ఆఆ జాణ
ఈ లోకం క్రొత్తగా ఉందయ్యో బొత్తిగా
భూగోళం కూడా నేడే పుట్టింది
నీ వల్లే ఇంతలా మారాలే వింతగా
నువ్వంటే నాకు పిచ్చే పట్టింది
లా ల లా లా ల లలాల లా లలా
నన్నే నన్నే చూస్తూ… నా గుండెల్లో గుచ్చేస్తూ
నువ్వేదో ఏదో ఏదో చెయ్యొద్ధే..!
సోకుల గాలం వేస్తూ… నీ మాటల్లో ముంచేస్తూ
ఓ యమ్మో అమ్మో… ప్రాణం తియ్యొద్ధే
నీకో నిజమే చెప్పన్నా
నా మదిలో మాటే చెప్పనా… యదలో ఏదో తుంటరి థిల్లానా
నాలో ఏదో అల్లరి… అది నిన్నా మొన్నాలేనిదీ
మరి ప్రేమో ఏమో ఒకటే హైరానా
హ్హ..! ఒహు వహా… ఒహు వహా.. ఏమిటంటారు ఈ మాయని
ఒహు వహా… ఒహు వహా… ఎవరినడగాలో ప్రేమేనా అనీ
ప్రేమేనా అనీ ప్రేమేనా అనీ… ప్రేమేనా అనీ