నాన్న… నన్నెప్పుడూ వెంటాడే ఎమోషన్… నవ్వు లేకుండా నాన్న మొహం ఎలా ఉంటుందో నాకిప్పటి వరకు తెలియదు.
ఏ కష్టం ఎదురొచ్చినా… కన్నీళ్లు ఎదిరించినా..
ఆనందం అనే ఉయ్యాలలో నను పెంచిన…
నాన్నకు ప్రేమతో… నాన్నకు ప్రేమతో…
నాన్నకు ప్రేమతో… అంకితం నా ప్రతీ క్షణం…
నే నే దారిలో వెళ్లినా… ఏ అడ్డు నన్నాపినా…
నీ వెంట నేనున్నానని నను నడిపించిన…
నాన్నకు ప్రేమతో… నాన్నకు ప్రేమతో…
నాన్నకు ప్రేమతో… అంకితం నా ప్రతీ క్షణం…
ఏ తప్పు నే చేసినా.. తప్పటడుగులే వేసినా…
ఓ చిన్ని చిరునవ్వుతోనె… నను మన్నించిన…
నాన్నకు ప్రేమతో… నాన్నకు ప్రేమతో…
నాన్నకు ప్రేమతో… అంకితం నా ప్రతీక్షణం…
ఏ ఊసు నే చెప్పినా… ఏ పాట నే పాడినా…
భలే ఉంది మళ్లీ పాడరా… అని మురిసిపోయిన…
నాన్నకు ప్రేమతో… నాన్నకు ప్రేమతో…
నాన్నకు ప్రేమతో… అంకితం నా ప్రతీక్షణం…
ఈ అందమైన రంగుల లోకానా…
ఒకే జన్మలో వందల జన్మలకు ప్రేమందించిన…
నాన్నకు ప్రేమతో… నాన్నకు ప్రేమతో…
నాన్నకు ప్రేమతో… వందనం ఈ పాటతో…
ఈ పాటతో… ఈ పాటతో…
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.