Menu Close

Nammaku Nammaku Song Lyrics In Telugu – Rudraveena


సీకటమ్మ సీకటి ముచ్చటైన సీకటి
వెచ్చనైన ఊసులెన్నో రెచ్చ గొట్టు సీకటి
నిన్ను నన్ను రమ్మంది కన్నుగొట్టి సీకటి
ముద్దుగా ఇద్దరికే ఒద్దికైన సీకటి
పొద్దు పొడుపేలేని చీకటే ఉండిపోని
మనమధ్య రానీక లోకాన్ని నిద్దరోనీ
రాయే రాయే రామసిలక సద్దుకుపోయే సీకటెనకా… ఆ ఆ

నమ్మకు నమ్మకు ఈ రేయిని 
కమ్ముకు వచ్చిన ఈ మాయని
నమ్మకు నమ్మకు ఈ రేయిని 
అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని
కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
నీ కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
కలలే వలగా విసిరే చీకట్లను
నమ్మకు నమ్మకు ఈ రేయిని 
అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని

వెన్నెలలోని మసకలలోనే మసలును లోకం అనుకోకు
రవికిరణం కనపడితే తెలియును తేడాలన్ని
నమ్మకు నమ్మకు అరె నమ్మకు నమ్మకు
నువ్వు నమ్మకు నమ్మకు ఈ రేయిని
అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని

ఆకాశం తాకే ఏ మేడకైన 
ఆధారం లేదా ఈ నేలలో
ఆకాశం తాకే ఏ మేడకైన 
ఆధారం లేదా ఈ నేలలో
పుడమిని చూడని కన్ను 
నడపదు ముందుకు నిన్ను
నిరసన చూపకు నువ్వు ఏనాటికి
పక్కవారి గుండెల నిండ… చిక్కనైన వేదన నిండ
పక్కవారి గుండెల నిండ… చిక్కనైన వేదన నిండ
ఏ హాయి రాదోయి నీవైపు… మరువకు అది

నమ్మకు నమ్మకు… అరె నమ్మకు నమ్మకు 
ఆహా నమ్మకు నమ్మకు ఈ రేయిని
అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని

శీతాకాలంలో ఏ కోయిలైనా… రాగం తీసేనా ఏకాకిలా
శీతాకాలంలో ఏ కోయిలైనా… రాగం తీసేనా ఏకాకిలా
మురిసే పువ్వులు లేక విరిసే నవ్వులు లేక
ఎవరికి చెందని గానం సాగించునా
పదుగురి సౌఖ్యం పండే దినమే పండుగకాదా
పదుగురి సౌఖ్యం పండే దినమే పండుగకాదా
ఆనాడు వసంత గీతాలు పలుకును కద

మ గసమ గసమ దమద నిదని
మమమ మగస మమమమదమ దదదనిదద నినినిని
సగసని సని దనిదమదమ నిసనిదసని దనిదమపగ

నమ్మకు నమ్మకు… అరె నమ్మకు నమ్మకు 
ఆహా నమ్మకు నమ్మకు ఈ రేయిని
అహ కమ్ముకు వచ్చిన ఈ మాయని
కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
నీ కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
కలలే వలగా విసిరే చీకట్లను
నమ్మకు నమ్మకు ఈ రేయిని 
అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని

Like and Share
+1
2
+1
0
+1
0
Posted in Lyrics in Telugu - Movie Songs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading